Tnrnews.in
తెలంగాణ

క్వాలిటీ చికెన్ ను అందించి ప్రజల ఆదరణ పొందాలి..

క్వాలిటీ చికెన్ ను అందించి ప్రజల ఆధరణ పొందినప్పుడు వ్యాపారం అభివృద్ధి చెందుతుందని జిల్లా బీఆర్ఎస్ నాయకులు ముదిరెడ్డి సంతోష్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పాత శ్రీదేవిబార్ వద్ద మిఠాయిపొట్ల పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన క్వాలిటీ చికెన్ హబ్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా తమ కాళ్ళపై తాము స్వయం ఉపాధి పొందాలని ఆలోచించి చికెన్ సెంటర్ పెట్టడం అబినందనీయమన్నారు. నాణ్యమైన చికెన్తో పాటు కోడిగుడ్లను అందించే క్వాలిటీ చికెన్ హబ్ సేవలను పట్టణ, పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. నిర్వాహకులు చిత్తలూరి నగేష్ మాట్లాడుతూ మా క్వాలిటీ చికెన్ హబ్లో నాణ్యమైన చికెన్ను వివాహాది శుభకార్యాలకు ఆర్డర్లపై అందిస్తామన్నారు. దుకాణ ప్రారంభం సందర్భంగా నెల రోజుల వరకు కిలో చికెన్ కొనుగోలు చేసిన వారికి నాలుగు కోడిగుడ్లు, అరకిలోకు రెండు కోడిగుడ్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరబాబు, నాగరాజు, గౌస్, శ్యాం, ఉపేందర్, మధు, వెంకన్న తదితరులు ఉన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

రైతులు నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలి

Harish Hs

సాంస్కృతిక కార్యక్రమాలతో మానసిక ఒత్తిడి దూరం  ….. కరెస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్

TNR NEWS

ఏఎస్ఐ గా పదోన్నతి పొందడం సంతోషకరం కోదాడ యూనైటెడ్ పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు రివరెండ్ వి యేసయ్య 

TNR NEWS

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

TNR NEWS

సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి

Harish Hs

ఆపదలో ఉన్న మిత్రురాలికి పూర్వ విద్యార్థులు ఆర్థిక సహాయం

TNR NEWS