ఇందిరమ్మ ఇండ్ల సర్వే పకడ్బoదిగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు అన్నారు.మంగళవారం కోదాడ మున్సిపాల్టీ పరిధిలో గల శ్రీరంగాపురంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేని అదనపు కలెక్టర్ పి రాంబాబు పరిశీలించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల సర్వే త్వరగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు.సర్వే కి వెళ్ళినప్పుడు లబ్దిదారులను వారికి సంబందించిన ఖాళీ స్థలం వివరాలను తెలుసుకొని ఆన్ లైన్ లో నమోదు చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమం లో మున్సిపల్ కమిషనర్ రమాదేవి, టౌన్ ప్లానింగ్ అధికారి ప్రసాద్, మేనేజర్ రాబిన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.