Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

కోదాడ స్వర్ణ భారతి ట్రస్ట్ చేస్తున్న సేవలు అభినందనీయమని కోదాడ తహసిల్దార్ వాజిద్ అన్నారు. గురువారం పట్టణంలోని స్థానిక రంగా థియేటర్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన హైటెక్ చలివేంద్రం వద్ద దాతలు పందిరి సత్యనారాయణ, షర్మిల 31వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి సహకారంతో మండుటెండలో వెళ్లే పాదచారులకు చల్లటి మజ్జిగను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవిలో ప్రజలు దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు దాతలు ముందుకు వచ్చి చేయూతనందించడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో గరినే శ్రీధర్, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చారుగండ్ల రాజశేఖర్, కార్యనిర్వాహక అధ్యక్షులు ఓరుగంటి కిట్టు, ఉపాధ్యక్షులు యాద సుధాకర్, సభ్యులు గుడు గుంట్ల సాయి, వెంకటరమణ, సుధాకర్, శ్రీనివాసరావు, హైమావతి, రంగారావు, సురేందర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు……….

Related posts

*పిట్లం ఎమ్మార్వో ఆఫీస్ ను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్*

TNR NEWS

ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

TNR NEWS

రోడ్లపై జరిగే వాహనాల ప్రమాదాలపై ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించాలి

Harish Hs

25 న బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం 

TNR NEWS

తుర్కపల్లి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక. అర్హులకు అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తారు..  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు.. హరి నారయణ గౌడ్

TNR NEWS

*మద్యం మత్తులో లారీ డ్రైవ్…. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసిన.. పెద్దపల్లి ట్రాఫిక్ సీఐ*

TNR NEWS