Tnrnews.in
తెలంగాణరాజకీయం

మే డే స్ఫూర్తితో పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు 

మోతే : మే డే స్ఫూర్తితో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు ప్రజలు సిద్ధం కావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు. బుధవారం మండల పరిధిలోని బురకచర్ల గ్రామంలో ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే వారోత్సవాలలో భాగంగా బురకచర్ల గ్రామంలో మే డే సందర్భంగా సిపిఎం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో కి వచ్చిన బిజెపి ప్రభుత్వం 11 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఎలాంటి ఉపయోగం చేసే పని ఒక్కటి చేయలేదన్నారు. కార్మిక హక్కులను కాలరాస్తూ కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని విమర్శించారు. అనేక సంవత్సరాల పాటు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మొత్తం నిర్వీర్యం చేస్తూ కార్మికులకు నష్టం కలిగించే చర్యలకు పాల్పడుతుందన్నారు. రైతాంగానికి, కార్మికులకు, వ్యవసాయ కార్మికులకు నష్టం కలిగించే చర్యలకు బిజెపి ప్రభుత్వం పాల్పడుతూ వారి హక్కులను కాలరాస్తుందన్నారు. అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ రోజురోజుకు బడ్జెట్ తగ్గిస్తుందన్నారు. ఉపాధి హామీ కూలీలు ప్రతిరోజు రెండు పూటలా హాజరు వేయాలని నిబంధన పెట్టడం సరికాదన్నారు. ఉపాధి కూలీలను ఆదుకునేందుకు ప్రతికూలికి 200 రోజులు పని కల్పించి రోజు కూలి 600 ఇవ్వాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉపాధి కూలీల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికుల వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ మే 20న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం మొత్తం పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు కక్కిరేణి సత్యనారాయణ, రెడ్డి మల్ల ఇందిర,సిపిఎం సీనియర్ నాయకులు కొండా రాములు, సిపిఎం గ్రామ కార్యదర్శి కొండ భాస్కర్, డివైఎఫ్ఐ మండల నాయకులు చెరుకు శ్రీను, సిపిఎం సీనియర్ నాయకులు అచ్చాలు, పల్ల మరియమ్మ, సామ్రాజ్యం, ఇందిరా, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మంత్రి ఉత్తమ్ తో జుక్కల్ ఎమ్మెల్యే తోట భేటీ

TNR NEWS

నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే వారు జాగ్రత్తలు పాటించాలి. వేడుకల పేరుతో ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు. జిల్లా వ్యాప్తంగా పటిష్ట పోలీస్ బందోబస్తు తో పెట్రోలింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.  సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ ‌

TNR NEWS

గుడి నిర్మాణ దాతకు ఘన సన్మానం

Harish Hs

విద్యార్థులు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

Harish Hs

ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు బజరంగ్ సేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బహుమతులు

TNR NEWS

బిసి రిజర్వేషన్ల పెంపునకు 25న సత్యాగ్రహ దీక్ష

Harish Hs