Tnrnews.in
తెలంగాణవిద్య

ప్రతిభ కలిగిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు

ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల కోరికలు నెరవేర్చాలని భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా ఎదగాలని శనివారం కోదాడ పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో త్రిబుల్ ఐటీ సీట్లు సాధించిన విద్యార్థుల అభినందన సభలో పాల్గొన్న కోదాడ కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు.ఈ “విద్యార్థుల అభినందన సభ,,కి మండల విద్యాధికారి ప్రధానోపాధ్యాయులు సలీం షరీఫ్ అధ్యక్షత వహించారు. కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం కోదాడ ఆధ్వర్యంలో గత ఎస్ఎస్సి పరీక్షలలో జిల్లా ప్రధమ ర్యాంకు సాధించి ట్రిపుల్ ఐటీ సీట్లు పొందిన తాళ్లూరి రేఖ శ్రీ కి 5000 రూపాయలు అలాగే త్రిబుల్ ఐటీ సీటు సాధించిన నరేంద్రకు 5000 రూపాయలు చొప్పున మొత్తం పదివేల రూపాయలను వారికి క్యాష్ బహుమతి అందించడం జరిగింది. జిల్లాస్థాయి ర్యాంకు ,ట్రిపుల్ ఐటీ సీట్లు సాధించటం కోసం కృషి చేసిన ఉపాధ్యాయ సిబ్బందిని సంఘ నాయకులు అభినందించారు. భవిష్యత్తులో వివిధ రంగాల్లో ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామని సంఘ నాయకులు తెలిపారు. ఈ “అభినందన సభ,, కార్యక్రమంలో విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ముత్తవరపు రామారావు, ఎర్రవరం పిఎసిఎస్ చైర్మన్ నల్లజాల శ్రీనివాసరావు, రెడ్లకుంట మాజీ సర్పంచ్ సాదినేని అప్పారావు, మల్లెల పుల్లయ్య, సాతులూరు హనుమంతరావు, రావెళ్ళ కృష్ణారావు, వేమూరు విద్యాసాగర్, లైటింగ్ ప్రసాద్ వేమూరు రామయ్య ఉపాధ్ పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు డి. మార్కండేయ, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఇందిరా అనాధాశ్రమం కు ప్రభుత్వం సహకారం అందించాలి

Harish Hs

కన్నుల పండుగగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం

TNR NEWS

సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి

Harish Hs

గుండాల రాములుకు జోహార్లు

TNR NEWS

టాటా ఏసీఈ వాహనాలలో తరలిస్తున్న గోవులు పట్టివేత

Harish Hs

దేశాభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న నిర్మాణ రంగం

TNR NEWS