Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ఘనంగా నిమజ్జన కార్యక్రమం ఆకట్టుకున్న ఎన్ ఆర్ ఎస్ కాలేజ్ విద్యార్థుల ప్రదర్శన

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఎన్ ఆర్ ఎస్ కాలేజ్ లో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు ఆదివారం 5వ రోజు కు చేరుకున్నాయి. ఈ సందర్భంగా బాయ్స్, గర్ల్స్ క్యాంపస్ లలో ఏర్పాటు చేసిన విగ్రహాలకు ఆదివారం యాజమాన్యం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కోలాటాల, నృత్య ప్రదర్శన నిర్వహించారు. ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ నేపథ్యంగా ప్రదర్శించిన స్కిట్ పట్టణ ప్రజలను ఆకట్టుకుంది. పట్టణంలోని రంగా థియేటర్, పోలీస్ స్టేషన్, ఖమ్మం క్రాస్ రోడ్ లలో నిర్వహించిన ఈ ప్రదర్శనను చేసేందుకు ప్రజలు , ప్రయాణీకులు ఆసక్తి చూపారు. ఈ కార్యక్రమాలలో కాలేజ్ చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి, డైరెక్టర్ మనోహర్ రెడ్డి, కరస్పాండెంట్ వేణుగోపాల్ రావు, వైస్ ప్రిన్సిపాల్ జీ వీ, అకడమిక్ అడ్వైజర్ మైనం రామయ్య, పలువురు లెక్చరర్లు పాల్గొన్నారు.

Related posts

*కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ ఆమోదిత దినోత్సవ వేడుకలు* ….

Harish Hs

రోడ్డును ధ్వంసం చేస్తే చర్యలు తప్పవు…… పెంచికల్ పేట్ ఎస్సై,కొమురయ్య..

TNR NEWS

కాల్వశ్రీరాంపూర్ మండల కార్యాలయం లో ఘనంగా గనతంత్ర వేడుకలు

TNR NEWS

కోమరబండ లో పోలీసు ప్రజా భరోసా కార్యక్రమం పాల్గొన్న జిల్లా ఎస్పీ నరసింహ

TNR NEWS

జయశంకర్‌ ఆశయసాధనకు కృషి చేయాలి

Harish Hs

ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  వర్ధంతి వేడుకలు 

TNR NEWS