Tnrnews.in
తెలంగాణరాజకీయం

పంట నష్టపరిహారం కచ్చితంగా ఇవ్వాల్సిందే -కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ 

మోతె, నవంబర్ 5 ( TNR NEWS ) : రైతులు పండించిన పంటలకు నష్టపరిహారం కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఖచ్చితంగా ఇవ్వాలని కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మోతె మండల పరిధిలోని సర్వారం గ్రామంలో ఇటీవల తుఫాన్ కారణంగా నేలమట్టమైన పంట పొలాలను రైతులతో కలిసి పరిశీలన చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ వర్షాల కారణాలతో పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం కచ్చితంగా ఇవ్వాల్సిందే అని రైతులకు అత్యంత త్వరలోనే రైతు భరోసాని ఇచ్చి రైతులను ఆదుకోవాలని ఐకెపి కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసిన ధాన్యం రైతులు నష్టపోకుండా తేమశాతం చూడకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు లేని ఎడల మా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శీలం సైదులు యాదవ్,జిల్లా నాయకులు ఏలూరి వెంకటేశ్వరరావు,మిక్కిలినేని సతీష్ బాబు,పల్స మల్సూర్, రైతులు తదితరులు పాల్గొన్నారు

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మునగాల మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో పొగ మంచు

Harish Hs

ప్రవేట్ టీచర్లకు గుర్తింపు, హెల్త్ కార్డులు ఇవ్వాలి – టిపిటిఎల్ఎఫ్ డిమాండ్

TNR NEWS

విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకోవాలి – చైర్మన్ పందిరి నాగిరెడ్డి

TNR NEWS

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి ప్రజా పాలన పేరుతో పబ్బం గడుపుతున్నారు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు భోంపెల్లి సురేందర్ రావు

TNR NEWS

వికలాంగుల చెంతకు వీరయ్య -2 ప్రోగ్రామ్ పేరుతో ప్రత్యేక గ్రీవెన్స్ లు ఏర్పాటు

TNR NEWS

కనుల పండుగగా విజయ గణపతి దేవాలయం వార్షికోత్సవం

Harish Hs