Tnrnews.in
ఆంధ్రప్రదేశ్తెలంగాణప్రత్యేక కథనం

తీర్చలేని ఋణం

మాటలకే అందని కొన్ని అద్భుతమైన పదాలు ఉంటాయి

చేతలలో చూపించలేని అద్భుతమైన వాస్తవాలు ఉంటాయి

అర్థంపర్థం లేని ఆలోచనలతో

అవాస్తవాలు నిజమనుకునే భ్రమలు తారసపడతాయి

కానీ చెక్కుచెదరని ఒక ప్రేమ ఉంటుంది

చెరపలేని కొన్ని గుర్తులు పదిలంగా ఉంటాయి

చిన్న చిన్న ఆశలే కానీ చెప్పలేనంత ఆనందం ఆ ఒక్క పదంతో కన్నా అని ముద్దుగా నాన్న పిలిచే పిలుపు

తనని తాను అంకితం చేస్తూ బిడ్డ కోసం తెచ్చే గెలుపు

ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి ఆ దేవుడికి…

కొన్ని అక్షరాలు కన్నీటిని పెట్టిస్తాయి, మరికొన్ని అక్షరాలు జ్ఞాపకాలలో తేలి ఆడేలా చేస్తాయి, మరికొన్ని అక్షరాలు మాతృత్వ ప్రేమను పంచుతాయి, ఇలాంటి కోవలోకే వస్తాయి హరిరెడ్డి గారి కవిత్వాలు, గమ్మత్తుగా ముచ్చటిస్తూ, మైమరిపిస్తూ, అర్థవంతమైన భావంతో మరో ప్రపంచానికి విహరించేలా చేస్తాయి…

  • ఇక కవిత్వం విషయానికి వస్తే…

 

  • నాన్న రాయని డైరీ

 

నీ ముందడుగుల కోసం

ప్రతి చోట వెనక్కి తగ్గి

అహం మొత్తం వదిలేసాను..!

ఆనందాలన్నిటిని

మూట కట్టి

ముడుపులుగా చెల్లించాను..!

ఒక్కో చెమట చుక్కని

వడ్డీగా చెల్లించి

“ఋణం” తీర్చుకున్నాను..!

నిద్రలేని రాత్రులతో

ఎన్నో ఎన్నో

కలలుగన్నాను..!

నన్ను నేను తాకట్టు పెట్టి

నిన్ను నీలా

నిలుపుకున్నాను..!

ఒకవేళ నా డైరీలో నేను రాయలేకపోతున్నా

ఆ చివరి రెండు అక్షరాలు నువ్వే కన్నా..!

 

  • రచయిత : తిప్పాన హరిరెడ్డి

 

  • సమీక్ష :

బిడ్డ ముందడుగు కోసం ప్రతి చోట వెనక్కు తగ్గి అహాన్నే వదిలి పెట్టేస్తాడు నాన్న, బిడ్డ ఆనందం కోసం సంతోషాలన్నిటిని వడ్డీతో సహా చెల్లించేస్తాడు, ఎన్నో నిద్రలేని రాత్రులతో కలలు కని కన్నీటిని తాకట్టుపెట్టి అయినా సరే బిడ్డ కలలు నెరవేర్చడానికి ఎన్నిసార్లు ఓడినా,ముందడుగు వేస్తూనే ఉంటాడు, అంటూ బిడ్డల కోసం నాన్న పడే తాపత్రయం, కన్నీటిని దిగమింగి బిడ్డల ఎదుగుదల కోసం అతను పడే ఆవేదన, కనులకు సాక్షాత్కరించారు రచయిత…

ఒకవేళ నా డైరీలో నేను రాయలేకపోతున్నా ఆ చివరి రెండు అక్షరాలు నువ్వే కన్నా అనే ముగింపు, పాఠకులను కన్నీరు పెట్టిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు…

ఎన్ని ఎదురు దెబ్బలు, ఎన్ని ఎత్తు పొడుపు మాటలు, ఎన్ని వేల నిద్రలేని రాత్రులు, ఎన్ని కన్నీటి చుక్కలతో గడిపిన రోజులు, పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం, వారిని వారు అంకితమిస్తూ గొప్ప మార్గాన్ని నిర్దేశించడంలో తల్లిదండ్రులను మించి ఎవరు ఉండరు….

స్వచ్ఛమైన ప్రేమ పంచడంలో వారిని మించిన వ్యక్తులు ఈ ప్రపంచంలోనే కాదు ఈ జీవితంలో కూడా తారసపడరు అనేది వాస్తవం…

ఎంతో గొప్ప ఆలోచనతో, తండ్రి కొడుకుల మధ్య ఉన్న అనుబంధాన్ని, బాంధవ్యాన్ని, వివరంగా క్లుప్తంగా అర్థవంతంగా వివరించారు…

ఇలాంటి మరెన్నో కవనాలు మీ కలం నుంచి పుట్టుకురావాలని, పాఠకులను మైమరిపించి అబ్బురపరిచే అద్భుతమైన అక్షరాలు మీరు పాఠకులకు అందించాలని, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను….

  • సమీక్ష : పోలగాని భానుతేజశ్రీ

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పిఠా‘‘పుర’’ంలో ఎన్నికల కోడ్‌ వర్తించదా…!? – చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు

Dr Suneelkumar Yandra

సమస్యల పరిష్కారానికి కృషి…..

TNR NEWS

టీవీ ఏసి జేఏసీ నిరవధిక సమ్మె పోస్టర్ ఆవిష్కరణ

TNR NEWS

సూక్ష్మ కళాకారుడి అద్భుత ప్రతిభ

TNR NEWS

ఆయిల్ ఫామ్ సాగు చేస్తే అధిక లాభాలు

TNR NEWS

కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక,రైతు,ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించండి.  నవంబర్ 26న జిల్లా కేంద్రంలో జరుగు నిరసనల్లో పాల్గొనండి.  -బాల్ రామ్ సిఐటియు జిల్లా కార్యదర్శి

TNR NEWS