Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ఆర్టిజన్లను కన్వర్షన్ చేయాలి… ప్రభుత్వం వెంటనే జాక్ తో చర్చలు జరపాలి.. భూపాల్ CITU రాష్ట్ర ఉపాధ్యక్షులు 

సూర్యాపేట: తెలంగాణ రాష్ట్రంలోని 20 వేల మంది ఆర్టిజన్లు మరో అయిదు వేల మంది ఔట్సోర్సింగ్ పీస్ రేటు బిల్ కలెక్టర్లు అన్ మాన్ వర్కర్లు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. గత ఆరు రోజులుగా సమ్మెలో ఉన్నారు. వీళ్ళ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం కాలయాపన చేస్తున్నది. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని వాళ్ళ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ఈరోజు సూర్యాపేట లోని విద్యుత్ కార్మికుల సమ్మె శిబిరాన్ని సందర్శించి రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ డిమాండ్ చేశారు. ఆర్టిజన్ అడుగుతున్న కన్వర్జేషన్ గాని ఏపీఎస్ఈబీ సర్వీసురూల్ అమలు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదు. ముఖ్యమంత్రి గారు, విద్యుత్ శాఖ మంత్రి గారు జోక్యం చేసుకొని అధికారులతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక ముందు ఆర్టిజన్ల సమస్యలు పరిష్కారం చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. రెండు సంవత్సరాలు గడిచిన నేటికీ పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలోని 25 వేల మంది ఏకతాటి గా జేఏసీ ఏర్పాటు చేసుకొని సమ్మెకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమ్మెకు ప్రధాన భాద్యత ప్రభుత్వమే వహించాలి .ప్రజలకు అసౌకర్యాలు ఇబ్బంది కలిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలి. సమ్మె చేస్తున్న వాళ్ళు చట్టబద్ధంగా సమ్మె నోటీస్ ఇచ్చి చేస్తున్నారు.దాని పరిగణలోకి తీసుకోకుండా జెన్కోలో ని కేటీపీఎస్ అనేక ప్రాంతాల్లో టర్మినేషన్ ఆర్డర్స్ ఇవ్వడం దుర్మార్గం. తక్షణమే టర్మినేషన్ ఆర్డర్స్ ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వ నిర్బంధ కాండము వినడానికి సమస్యలు పరిష్కారం చేయాలి అలాగే 5000 మంది ఔట్సోర్సింగ్ అభిమానులు లు తీసి రేటు బిల్ కలెక్టర్లు తదితరులకు కార్మిక చట్టాలు అమలు కావడం లేదు వాళ్లకు కనీస వేతనం ఇవ్వాలి. పనిగంటలు అమలు చేయాలి. పిఎఫ్ ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు వర్తింప చేయాలి.వీటినీ కూడా ప్రభుత్వం అమలు చేయడం లేదంటే ప్రభుత్వం కార్మిక వ్యతిరేక వైఖరి కలిగి ఉన్నదని అర్థమవు తున్నది. విద్యుత్ కార్మికుల సమయం పట్టించుకోకుండా కాలయాపన చేస్తే రాబోయే కాలంలో అన్ని కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు ఇతర సంఘాన్ని కలుపుకొని వారికి మద్దతుగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు వెంకటనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి నేమ్మాది వెంకటేశ్వర్లు సిఐటియు వర్కింగ్ ఉమెన్ కన్వీనర్ ఏకలక్ష్మి సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ముత్యాలు, రణపంగా కృష్ణ, బచ్చలకూరి స్వరాజ్యం తదితరులు ప్రసంగిస్తూ ఆర్టిజన్ సమ్మెకు సంపూర్ణ మద్దతును ప్రకటించడం జరిగింది. ఈ రోజు ఇతర సంఘాలైన 1104 ,327, సి ఐ టి యు, టీర్ వి కె ఎస్ నరేందర్ మల్లికార్జున్ వెంకట్ , నరేందర్ రెడ్డి , నాగమణి యాకన్న తదితర నాయకులు ప్రసంగించడం జరిగింది. ఆర్టిజన్ల జేఏసీ నాయకులు గణేష్ తిరుపతి శ్రీధర్ రెడ్డి వెంకన్న తదితరులు ప్రసంగించడం జరిగింది.

Related posts

వ్యాసరచన పోటీల్లో తెలంగాణ గురుకుల పాఠశాల విద్యార్థినిల విజయపరంపర

TNR NEWS

ప్రజలు అనుకున్నదే నేను మాట్లాడాను – ఎన్నికలు ఎప్పుడొచ్చినా బి ఆర్ ఎస్ ప్రభుత్వం రావడం,  సీఎం కెసిఆర్ కావడం ఖాయం

TNR NEWS

ఇరాన్ పై అమెరికా సామ్రాజ్య వాదుల దాడులను తీవ్రంగా వ్యతిరేకించండి  వామపక్ష నేతల డిమాండ్

TNR NEWS

పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన విద్యార్థి నాయకులను విడుదల చేయాలి

Harish Hs

కొండపోచమ్మ సాగర్ ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరించాలి  – మంత్రులు కొండ సురేఖ, ఉత్తంకుమార్ రెడ్డి లకు వినతి పత్రం అందించిన నాయకులు

TNR NEWS

అదుపుతప్పి ముక్త్యాల బ్రాంచ్ కాలువలో పడిన ఆటో పలువురికి గాయాలు

TNR NEWS