Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

స్త్రీ ఆర్ధిక సాధికారతతోనే కుటుంబం అభివృద్ధి : పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా

పిఠాపురం, మే 07 : స్త్రీ ఆర్ధిక సాధికారత పొందితే కుటుంబం అభివృద్ధి సాధిస్తుంది అని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి అనుగ్రహ భాషణ చేసారు. గురువారం ఉదయం స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పిఎంఓ ప్రోడక్ట్స్ అనగా ప్రకృతి మాతృ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి వారు లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి వారు మాట్లాడుతూ మహిళా శక్తిలో ఉన్న నైపుణ్యలను వెలికి తీసి, వారి ఆర్థిక స్థిరత్వానికి బాటలు వేసేలా శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం మహిళా విభాగం కృషి చేస్తుందని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. ఈ కార్యక్రమానికి మహిళా సమన్వయకర్తగా పేరూరి కోమలిని నియమించుట జరిగిందన్నారు. మహిళా స్వావాలంబన కార్యక్రమంలో భాగస్వాములు కాదలిచిన స్త్రీ మూర్తులు కోమలి వద్ద శిక్షణ పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 90 మంది మహిళలు పాల్గొన్నారు. మహిళలు తయారు చేసిన ప్రోడక్ట్స్ ని, పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు మొట్ట మొదటి కొనుగోలు దారుగా కొన్ని ప్రోడక్ట్స్ ని స్వామి వారి అమృత హస్తములతో తీసుకున్నారు. తర్వాత అనేక మంది పిఎంఓ ప్రోడక్ట్స్ ని కొనుగోలు చేసారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం మహిళలు అంతా పేరూరి కోమలి నాయకత్వంలో మహిళా సాధికారిత కార్యక్రమంలో ఐకమత్యకంతో పాల్గొన్నారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు అందర్నీ ఆశీర్వదించారు. కార్యక్రమ సమన్వయకర్త కోమలి స్వామి వారికి స్వాగతం పలికి, కార్యక్రమం చివరిలో వందన సమర్పణ చేసారు.

 

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

బాల కార్మికులతో వెట్టిచాకిరి – పట్టించుకోని లేబర్ ఇన్స్పెక్టర్

Dr Suneelkumar Yandra

పిఠాపురంలో నిర్వాసిత బడ్డీ యజమానులకు.. పి4 ప్రణాళికగా జనతా దుకాణాలు నిర్మించాలి

Dr Suneelkumar Yandra

నాటు సారా స్వాధీనం – ముగ్గురు అరెస్టు

Dr Suneelkumar Yandra

నేపాల్‌లో చిక్కుకున్న మంగళగిరి వాసుల కుటుంబాలను పరామర్శించిన చిల్లపల్లి శ్రీనివాసరావు

Dr Suneelkumar Yandra

ఏపీలో రెండ్రోజులు వర్షాల హెచ్చరిక.. పిడుగులు పడే అవకాశం

TNR NEWS

కమ్మేసిన మంచు దుప్పటి

Harish Hs