Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

పాడా తాత్కాలిక భవన ఆధునీకరణ పనులు సకాలంలో పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి

పిఠాపురం : పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడా) తాత్కాలిక భవన ఆధునీకరణ పనులు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. పిఠాపురం మున్సిపల్ గెస్ట్ హౌస్ లో తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న పాడా కార్యాలయ పనులను గురువారం జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులతో కలిసి పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఠాపురం పరిధిలోని ప్రాంతాల అభివృద్ధి చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందన్నారు. పిఠాపురం, గొల్లప్రోలు, యు.కొత్తపల్లి మండలాల పరిధిలోని గ్రామాల్లో ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిస్థాయిలో అమలు అయ్యేలా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. ఇందుకు ప్రత్యేక అధికారులను నియమించిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. పాడా అధికారులు  పనుల పర్యవేక్షించేందుకుగాను పిఠాపురంలోని మున్సిపల్ గెస్ట్ హౌస్ లో పాడా కార్యాలయాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ పనులపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట పాడా ఇంచార్జ్ పీడీ ఎన్.శ్రీధర్ బాబు, ఏపీడీ పి.వసంత మాధవి, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు ఇతర ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ నెల ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు – ఏపీ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

ఘనంగా మల్లు స్వరాజ్యం మూడోవ వర్ధంతి

Dr Suneelkumar Yandra

అధికారంలో ఉన్నాం బాధ్యతతో వ్యవహరించాలి – జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కె. నాగబాబు

Dr Suneelkumar Yandra

కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేజ్రీవాల్

TNR NEWS

హోమియోపతి శరీరంలోని సహజ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్

TNR NEWS

స్మార్ట్ సిటీ సమ్మర్ స్టోరేజ్ అవసరాలు తీర్చాలి – పౌరసంక్షేమసంఘం డిమాండ్

Dr Suneelkumar Yandra