బిగ్బాస్ కార్యక్రమంలో ఎనిమిది వారాల పాటు కొనసాగి ఎలిమినేట్ అయిన ఝాన్సీ సూర్యాపేటకు చేరుకోగా పట్టణ ప్రజలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఝాన్సీ మాట్లాడుతూ.. బిగ్బాస్ అగ్నిపరీక్షలో లక్షలాది మందిలో తనను ఎంపిక చేశారంటే అది అభిమానులు తనపై చూపిన ఆదరాభిమానాలేనని అన్నారు. ఎనిమిది వారాల పాటు తనకు మద్దతుగా నిలిచి, ఆదరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.బిగ్బాస్ నుంచి ఎలిమినేట్ అయినప్పటికీ జీవితంలో మాత్రం తాను ఓడిపోలేదని, అభిమానుల ప్రేమాభిమానాలే తనకు కొండంత బలమని పేర్కొన్నారు. సూర్యాపేటలో భాను, శ్రీకాంత్ అందించిన మద్దతు, సహకారం ఎంతో ప్రత్యేకమని, వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. తన ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తరుణ్, రమేష్, సైదులు, హేమలతతో పాటు పలువురు అభిమానులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
