నిండ్ర చక్కెర ఫ్యాక్టరీ వద్ద లారీల ఢీ
నిండ్ర మండల పరిధిలోని నేటమ్స్ చక్కెర ఫ్యాక్టరీ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి-చెన్నై జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వెనుక వైపు వస్తున్న లారీ ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. ప్రమాదానికి భారీ వర్షమే కారణమని స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Save or share this story as a newspaper-style Epaper Clip:
