Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆరోగ్యం వైద్యంతెలంగాణవిద్య

గాయత్రి విద్యానికేతన్ లో హెల్త్ క్యాంప్

 

పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ లో గత మూడు రోజులుగా శ్రీ విరాజ్ హాస్పిటల్, పెద్దపల్లి వారి ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులకు హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంప్ లో డాక్టర్ ఎన్. రాజ్ కుమార్ (బి డి ఎస్, డెంటల్), డాక్టర్ జి. ఆంథోని రెడ్డి, డాక్టర్ నవీన్, లయన్స్ క్లబ్ విజన్ కేర్ నేత్ర వైద్య నిపుణులు పూదరి దత్తా గౌడ్, అబ్దుల్ వాసే లు పాల్గొని విద్యార్థులకు దంత సంబంధిత, నేత్ర సంబంధిత మరియు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గాయత్రి విద్యా సంస్థల కరస్పాండెంట్ అల్లెంకి రజనీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆరోగ్య సమస్య వచ్చిన తర్వాత బాధపడే కంటే అసలు సమస్య రాకుండా చూసుకోవడమే అత్యుత్తమమని అన్నారు. అనంతరం పిల్లలకు ఆరోగ్య సంరక్షణ విషయంలో తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమాన్ని గాయత్రి విద్యా సంస్థల ఛైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ పర్యవేక్షించారు. ప్రిన్సిపాల్ విజయ్, రజియుద్దీన్, ఉపాధ్యాయ బృందం విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

హలో జర్నలిస్టు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి హైదరాబాద్ సచివాలయం మీడియా పాయింట్ వద్ద పోస్టర్ ఆవిష్కరణ చేసిన టిఎస్ జేఏ నాయకులు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేంతవరకు ఉద్యమిస్తూనే ఉంటాం రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి

TNR NEWS

వరంగల్: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న అఘోరి 

TNR NEWS

గిరి పుత్రులకు ఏకలవ్యలో ఆహ్వానం… ఇఏంఆర్ఎస్ లో 6వ తరగతికి అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలి  ప్రిన్సిపాల్ కనిక వర్మ

TNR NEWS

విద్యార్థులు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

Harish Hs

*సర్పంచ్, కార్యదర్శికి మళ్లీ జాయింట్ చెక్ పవర్?..ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేసే చాన్స్..!!* ఉప సర్పంచ్కు చెక్ పవర్ తొలగించే యోచనలో సర్కారు వరుసగా రెండు టర్మ్ల రిజర్వేషన్ ను రద్దుచేసే చాన్స్ అభ్యర్థులకు ఇద్దరు పిల్లలకు మించి ఉండరాదనే నిబంధన కూడా ఎత్తివేత! పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలకు ప్రభుత్వం కసరత్తు

TNR NEWS

ఈనెల 20న వేములవాడలో సీఎం రేవంత్ పర్యటన

TNR NEWS