Tnrnews.in
తెలంగాణ

న్యాయవాదుల పై దాడులను అరికట్టాలి

దేశంలో,రాష్ట్రంలో రోజురోజుకు న్యాయవాదులపై దాడులు పెరిగిపోతున్నాయని, వాటిని అరికట్టేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ ఆర్ కే మూర్తి డిమాండ్ చేశారు. హైదారాబాద్ లో అడ్వకేట్ పై కత్తులతో దాడి చేసిన సంఘటనకు నిరసనగా బుధవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోదాడ కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ న్యాయవాదులపై దాడులు పెరుగుతున్న ప్రభుత్వాలు మాత్రం వారి రక్షణకు చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేసారు. న్యాయవాదుల రక్షణకు సమగ్ర చట్టం రూపొందించి, దానిని అమలు చేయాలని, దాడులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గట్ల నరసింహారావు, ప్రధాన కార్యదర్శి చింతకుంట్ల రామిరెడ్డి, కార్యవర్గం కోడూరు వెంకటేశ్వర రావు, హేమలత, దొడ్డ శ్రీధర్, పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

విద్యతోనే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు…….  కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి…….  కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్….

TNR NEWS

ఆటో డ్రైవర్ నిజాయితీని మెచ్చిన డీఎస్సీ

TNR NEWS

*ఓ ప్రజా ప్రతినిధి దివ్యాంగుని పై దాడి* ★ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితుడు. ★ ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ★వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షురాలు రాధిక డిమాండ్,

TNR NEWS

అక్విడేషన్ ప్రక్రియను వెంటనే చేపట్టాలి : గడ్డంఅంజి

TNR NEWS

ట్రాక్టర్ క్రేజ్ వీల్స్ వినియోగిస్తే వాహనాల సీజ్….. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

TNR NEWS

రామగుండం పోలీస్ కమీషనరేట్*రామగుండం పోలీస్ కమీషనరెట్ పోలీస్ ఏర్పాట్ చేసిన స్టాల్ సదర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

TNR NEWS