Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

క్వాలిటీ చికెన్ ను అందించి ప్రజల ఆదరణ పొందాలి..

క్వాలిటీ చికెన్ ను అందించి ప్రజల ఆధరణ పొందినప్పుడు వ్యాపారం అభివృద్ధి చెందుతుందని జిల్లా బీఆర్ఎస్ నాయకులు ముదిరెడ్డి సంతోష్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పాత శ్రీదేవిబార్ వద్ద మిఠాయిపొట్ల పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన క్వాలిటీ చికెన్ హబ్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా తమ కాళ్ళపై తాము స్వయం ఉపాధి పొందాలని ఆలోచించి చికెన్ సెంటర్ పెట్టడం అబినందనీయమన్నారు. నాణ్యమైన చికెన్తో పాటు కోడిగుడ్లను అందించే క్వాలిటీ చికెన్ హబ్ సేవలను పట్టణ, పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. నిర్వాహకులు చిత్తలూరి నగేష్ మాట్లాడుతూ మా క్వాలిటీ చికెన్ హబ్లో నాణ్యమైన చికెన్ను వివాహాది శుభకార్యాలకు ఆర్డర్లపై అందిస్తామన్నారు. దుకాణ ప్రారంభం సందర్భంగా నెల రోజుల వరకు కిలో చికెన్ కొనుగోలు చేసిన వారికి నాలుగు కోడిగుడ్లు, అరకిలోకు రెండు కోడిగుడ్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరబాబు, నాగరాజు, గౌస్, శ్యాం, ఉపేందర్, మధు, వెంకన్న తదితరులు ఉన్నారు.

Related posts

మహిళా పోలీస్ సిబ్బందికి హెచ్. పి. వి. క్యాన్సర్ వ్యాక్సినేషన్ పై అవగాహన సదస్సు

TNR NEWS

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి… జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్…

TNR NEWS

మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

Harish Hs

*మాలల సింహగర్జన సభకు తరలిన నాయకులు*

TNR NEWS

అభయాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదానం…..   చిల్లంచర్ల హరికృష్ణ జ్ఞాపకార్థం అన్నదానం…

TNR NEWS

సూర్యాపేట జిల్లా ఎస్పీ గా కె. నరసింహ

Harish Hs