Tnrnews.in
తెలంగాణ

సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి 

దౌల్తాబాద్: సమగ్ర శిక్ష ఉద్యోగులను ప్రభుత్వం గుర్తించి వెంటనే రెగ్యులర్ చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శేఖర్ అన్నారు. శనివారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ మండల వనరుల కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి ఎంఈఓ కనకరాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం నడుస్తున్న నేటికి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం లేదని అన్నారు. 15 రోజుల్లో సమస్యలను పరిష్కరించకుంటే సమ్మె చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గాడి రాజు, సంఘం సభ్యులు పెంటయ్య, నగేష్, చంద్రమౌళి, మల్లేశం, కేజీబీవీ సిబ్బంది మమత, రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు….

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

నవజీవన్ ఎక్స్ ప్రెస్ తిరిగి పెద్దపల్లి రైల్వే స్టేషన్ జంక్షన్లో నిలుపుదల చేయాలి.. దక్షిణ మధ్య రైల్వే డివిజన్ మేనేజర్ సికింద్రాబాద్ వారికి వినతి.. –డి.ఆర్.యు.సి.సి రైల్వే కమిటీ మెంబర్ ఎన్డి .తివారి..

TNR NEWS

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి….

TNR NEWS

బాధితుల ఇంటి వద్ద నుండి తొలి FIR నమోదు చేసిన సూర్యాపేట జిల్లా పోలీస్. _ఇంటి వద్దే FIR.. తొలి కేసు నమోదు చేసిన సూర్యాపేట జిల్లా నడిగూడెం పోలీసులు.

TNR NEWS

సమస్యల పరిష్కారానికి కృషి…..

TNR NEWS

సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి

Harish Hs

ఈనెల 26న జరిగే గొర్రెల, మేకల పెంపకం దారుల సంఘం జిల్లా మూడవ మహాసభను జయప్రదం చేయండి

TNR NEWS