Tnrnews.in
తెలంగాణ

రాంసాని పల్లి చౌరస్తా వద్ద ఎక్స్‌ప్రెస్‌ స్టాప్‌     హర్షం వ్యక్తం చేస్తున్న 5 గ్రామాల ప్రజలు, విద్యార్థులు

 

గత కోన్ని రోజులుగా బస్టాప్‌ లేక పోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని, రాంసానిపల్లి చౌరస్తా వద్ద బస్టాప్‌ ను ఏర్పాటు చేయాలంటూ ఐదు గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు నారాయణఖేడ్‌ డిపో మేనేజర్‌ను కలిసి కోరగా ఆయన సానుకూలంగా స్పందించి ఎక్స్‌ప్రెస్‌ స్టాప్‌కు అనుమతినిచ్చారు. గత కొన్ని రోజులుగా ప్రయాణీకులు, విద్యార్థులు ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు, నాయకులు సోమవారం రాంసానిపల్లి వద్ద ఆర్టీసీ బస్‌స్టాప్‌ కోసం ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక నుంచి అన్ని రకాల ఆర్టీసీ బస్సులు ఇక్కడ అగుతాయని ఆర్టీసీ అధికారులు గ్రామ నాయకులకు హమీ ఇచ్చారు. చౌరస్తా వద్ద బస్టాప్‌ ఏర్పాటుతో రాంసానిపల్లి, ఎర్రారం, నేరడిగుంట, రాంసాని పల్లి తండా, కిచ్చన్నపల్లి గ్రామాలకు చెందిన ప్రయాణికులకు ఎంత గానో లబ్ధి చేకూరుతుందని ఆయా గ్రామాల నాయకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా ఇక్కడ బస్సులు అపకపోవడంతో ప్రయివేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. నారాయణ ఖేడ్‌ డిపో మేనేజర్‌ మల్లేశం చొరవతో బస్టాప్‌ ఏర్పాటు అయ్యిందని, ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాలకు చెందిన పెద్దలు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకిచ్చిన హమీలను నెరవేర్చాలి – డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి

TNR NEWS

హైదరాబాదులో జరిగే మాలల సింహ గర్జన సభను జయప్రదం చేయండి..  జాతీయ తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పరుస వెంకటేష్ పిలుపు..

TNR NEWS

*మాలల సింహాగర్జనను విజయవంతం చేయాలి* ● సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని పలు గ్రామాల్లో సింహగర్జన వాల్ పోస్టల్ ఆవిష్కరణ

TNR NEWS

*మద్నూర్ లో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన దీక్ష*

TNR NEWS

నరసింహులగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం

TNR NEWS

జాన్ పహాడ్ ఉర్సు గంధం ఊరేగింపు ప్రారంభించిన మంత్రి

TNR NEWS