Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

లోక కళ్యాణమే అందరి అభిమతం ● సెమీ క్రిస్మస్ వేడుకల్లో కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గం ఇంచార్జ్ పామేన భీమ్ భరత్

కులమతాలు ఏవైనా లోక కళ్యాణమే ప్రతి ఒక్కరి అద్భుతం కావాలని కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గం ఇంచార్జ్ పామేన భీమ్ భరత్ పేర్కొన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలోని రంగారెడ్డి కాలనీలో గల కర్మేల్ ప్రార్థన మందిరంలో ఆదివారం సేమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో స్థానిక సీఐ భూపాల్ శ్రీధర్, ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన పాల్గొని క్రైస్తవ పెద్దలతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కుల, మతాలకు ప్రాధాన్యతనిస్తుందన్నారు. ఏసుక్రీస్తు లోక కళ్యాణం కోసం పాటుపడ్డారన్నారు. క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల మాజీ సర్పంచ్ బండారి శైలజా ఆగిరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ నాయకులు సుశాంత్, నాయకులు బురణ్ సురేష్, పాస్టర్ స్టీఫెన్, క్రైస్తవ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

గ్రాండ్ టెస్ట్ విజేతలకు నేడు బహుమతుల ప్రధానోత్సవం

Harish Hs

అంగరంగ వైభోగంగా వీడ్కోలు సన్మాన మహోత్సవం

TNR NEWS

రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోయవద్దు- ఎస్పీ నరసింహ

TNR NEWS

కనుల పండుగగా విజయ గణపతి దేవాలయం వార్షికోత్సవం

Harish Hs

ఎస్బిఐ సేవా కేంద్రంలోనే దర్జాగా పాఠ్యపుస్తకాలు వ్యాపారం

TNR NEWS

కోదాడలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

Harish Hs