Tnrnews.in
తెలంగాణరాజకీయం

కోదాడలో రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ప్రారంభం

కోదాడలో రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు పట్టణంలోని స్థానిక తేజ పాఠశాల ఆవరణలో శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కాగా ఈ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు హాజరై ప్రారంభించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే మంచి గుర్తింపు ఉంటుంది అన్నారు. కోదాడ ప్రాంతం నుంచి ఎంతమంది క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీలో రాణిస్తున్నారని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో వారిని ప్రోత్సహిస్తే మంచి క్రీడాకారులుగా ఎదుగుతారన్నారు. మొట్టమొదటిసారిగా రాష్ట్రస్థాయి పోటీలను కోదాడలో పెట్టినందుకు జాతీయస్థాయి క్రీడాకారిని పోటీల నిర్వాహకులు పాలడుగు ఖ్యాతిని అభినందించారు. అనంతరం తెలంగాణ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పాలడుగు ఖ్యాతి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి మొదటిరోజు మొత్తం 120 మంది హాజరయ్యారని జూనియర్ సీనియర్ క్యాటగిరిలో మెన్ అండ్ ఉమెన్ కు అదేవిధంగా యూత్ విభాగంలో బాయ్స్, గర్ల్స్ కు పోటీలను నిర్వహించినట్లు తెలిపారు. సాయంత్రం వేళా కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి పాల్గొని మొదటిరోజు పోటీలో పాల్గొన్న విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, కోదాడ మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల, మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు,రాష్ట్ర నాయకులు మహబూబ్ జానీ, మేకల వెంకట్రావు,తెలంగాణ రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పాలడుగు ఖ్యాతి, మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, వెయిట్ లిఫ్టింగ్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పుల్లారావు, జానకి రామయ్య, హనుమంత రాజు, శివ, కృష్ణమూర్తి, శ్రీనివాస్, శివ గణేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు……….

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

వాసవి క్లబ్ కోదాడ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు

Harish Hs

*విద్యార్థులకు పాఠాలు బోధించిన సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్*

TNR NEWS

యువత మాదకద్రవ్యాలు, ఆన్‌లైన్‌ బెట్టింగులకు దూరంగా ఉండాలి

TNR NEWS

గాలివాన బీభత్సానికి నేలకొరిగిన చెట్లు

TNR NEWS

తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. బయటకు రావాలంటేనే వణుకుతున్న జనం..!!*

TNR NEWS

భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి వేడుకలను ఊరురా ఘనంగా నిర్వహించాలి.

Harish Hs