March 12, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం తప్పదు…..సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కారు గత అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారెంటీ ల పేరుతో ఎన్నో రకాల హామీలను ఇచ్చి కాలయాపన చేయడం దురదృష్టకరమని. మండల పరిధిలోని నరసింహ పురం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు డాక్టర్ వేమూరి సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఎన్నో రకాల హామీలు ఇచ్చి దానికి తోడు. వారి కేంద్ర పార్టీ పెద్దలు సీనియర్ నాయకులు అయిన సోనియాగాంధీ. రాహుల్ గాంధీ లాంటి నాయకులను తీసుకుని వచ్చి. వారితో కూడా చెప్పించారు. అలాగే. వారి పార్టీ అధికారంలో కి వచ్చిన వెంటనే డిసెంబర్ 9 వ తేదీ నే. అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పి మాట తప్పారు తదుపరి అదికారం చేపట్టిన తర్వాత వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి విస్మరించారు. ఆపైన పార్లమెంటు ఎన్నికల్లో. దేవుళ్ల మీద ఒట్లు వేసి. నమ్మించి. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందారు. ఇటీవల. సంక్రాంతి పండుగ సందర్భంగా అమలు చేస్తామని ఆ తదుపరి. డాక్టర్ అంబేద్కర్ గారి సాక్షిగా. రాజ్యాంగం అమలులోకి వచ్చిన జనవరి 26 వ తేదీన. కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా ఇలా నాలుగు పధకాలను అమలు చేస్తామని చెప్పి ఆరోజు అర్థరాత్రి. నుంచి అర్హులైన వారి అకౌంట్ లలో. రైతు భరోసా మరియు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎమౌంట్ వేస్తామని చెప్పి చివరికి మండలానికి ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా గుర్తించి. కేవలం ఆయా గ్రామాల్లో పూర్తిగా అర్హత గల వారిని కూడా విస్మరించటం బాధాకరమని. రాష్ట్ర ప్రజలను. వారి పార్టీ అదినాయకులను. దేవుళ్లను. చివరికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సాక్షిగా చెప్పి ఇలా అందరి ని. మోసం చేయడం అత్యంత బాధాకరమని. ప్రజలు మీ మీద నమ్మకం తో. అధికారం ఇస్తే. ఇలా చేయడం వంచించడమేనని. నాడు ఇచ్చిన. హామీలను వెంటనే బేషరతుగా ఎలాంటి ఆంక్షలు లేకుండా అమలు చేయాలని. లేకపోతే ప్రజా ఆగ్రహానికి గురవుతారని. ఇలాగే కొనసాగితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

Related posts

ఎమ్మార్పీఎస్ మహిళ జగిత్యాల జిల్లా ఇన్చార్జిగా వనిత 

TNR NEWS

దామరగిద్దలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

TNR NEWS

మద్నూర్ లో మహాత్మా గాంధీ వర్ధంతి

TNR NEWS

కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న బి.ఆర్.ఎస్.పార్టీ కలకోవ గ్రామశాఖ నాయకులు

Harish Hs

ఎమ్మార్పీఎస్ కలకోవ గ్రామశాఖ అధ్యక్షులుగా పాతకోట్ల బాలయ్య మాదిగ ఏకగ్రీవ ఎన్నిక

Harish Hs

TNR NEWS