Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

గత ప్రభుత్వంలో ఇళ్ళులేని పేదలకు ఇళ్ల పట్టాలిచ్చి స్థలం చూపించలేదు

పిఠాపురం : సి.పి.ఐ (యమ్.యల్) లిబరేషన్, మహిళా సంఘం (ఐప్వా) ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో ఇళ్ళు లేని పేదలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సి.పి.ఐ (యమ్.యల్) లిబరేషన్, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు శీలం అప్పలరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఇళ్ళులేని పేదలకు ఇళ్ల పట్టాలిచ్చి స్థలం చూపించలేదని, తక్షణం స్థలాలు చూపించి, ప్రభుత్వమే వారికి ఇంటిని నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హులైన వారికి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తానన్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీని నేటికీ అమలు చేయలేదని, ప్రకటనలకే పరిమితం అయిందని ఆరోపించారు. ఇప్పటికైన ప్రభుత్వ యంత్రాంగం స్పందించి అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, వితంతు, వృద్ధాప్య పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అర్హులైన వారందరితో కలసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పి.లోవకుమారి, బి.రాజేష్, కనకరాజు, నాగమణి, సుగుణ, కుమారి, ఏసు రాణి రాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts

శ్రీకాళహస్తి: స్వామివారి సేవలో సినీనటులు జీవిత రాజశేఖర్

TNR NEWS

భక్తి శ్రద్ధలతో శ్రీ షిరిడీ సాయిబాబా వారి 19వ ఆలయ వార్షికోత్సవం

Dr Suneelkumar Yandra

ఆధ్యాత్మిక, తాత్విక జ్ఞానము ద్వారా మన సమస్యలు మనమే పరిష్కరించుకోగలుగుతాము – శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా

Dr Suneelkumar Yandra

మెరుగైన ప్రజా జీవితానికి మెరుగైన మౌలిక సదుపాయాలె పునాది

TNR NEWS

ఉత్తమ ఉపాధ్యాయుడిగా దాకే అప్పలరాజు

Dr Suneelkumar Yandra

రియాన్స్‌ క్లినిక్‌ ఆధ్వర్యంలో ఘనంగా ఉచిత మెగా వైద్య శిబిరం