మహబూబాబాద్ జిల్లా, శుక్రవారం రోజున జాతీయ ఎస్టి కమిషన్ మెంబర్ జాటోతు హుస్సేన్ నాయక్, మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండల సమాపంలోని భీముని పాదం జలపాతాన్ని సందర్శించారు. ఉన్నత అధికారులతో అభివృధి పై సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. భీముని పాదం నుంచి జలధారగా వచ్చే నీటి ద్వారా, నిత్యం పర్యాటక ప్రాంతంగా ఉన్న జలపాత అభివృద్ధికి సహకరిస్తామని, లార్డ్ భీమా పాదాల మీద నీరు ప్రవహిస్తుంది. సూర్యుడు ఉదయించినప్పుడు, అస్తమించేటప్పుడు నీరు ఇంద్రధనస్సు రంగులలో ప్రకాశిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ. ఎంపీడీఓ ఎర్ర వీరస్వామి , మండల రెవెన్యూ తహసిల్దార్ శ్వేతా, ఐ టి డి ఏ. ఇరిగేషన్, అగ్రికల్చర్, పంచాయతీ రాజ్ శాఖ ఉన్నత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.