Tnrnews.in
తెలంగాణ

బిసి విద్యార్థి సంఘం కోదాడ నియోజకవర్గ అధ్యక్షుడి నియామకం

బీసీ సంక్షేమ సంఘం అనుబంధ విద్యార్థి సంఘం కోదాడ నియోజకవర్గ అధ్యక్షుడిగా బొడ్డుపల్లి పవన్ నియమితులయ్యారు. సోమవారం కోదాడ పట్టణంలో సూర్యాపేట జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షుడు నిద్ర సంపత్ నాయుడు నియామక పత్రాన్ని అందజేసి మాట్లాడుతూ విద్యార్థుల త్యాగాలు, బలిదానాలు,పోరాటాలు లేనిదే తెలంగాణ రాష్ట్రం రాలేదు.కాని వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గానికి జరుగని అన్యాయం విద్యార్థులకే జరుగుతుంది. భవిష్యత్ తెలంగాణ విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అంతా సాఫీగా జరుగుతుందని కళలు కన్నారని, కాని నేడు తెలంగాణ రాష్ట్రంలో ఇందుకు విరుద్ధంగా జరుగుతున్నది.ప్రభుత్వాలు ఏవైన కావచ్చు,అది నాటి బిఆర్ఎస్ ప్రభుత్వమా లేదా నేటి కాంగ్రెస్ ప్రభుత్వమా అన్నది కాదు.ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఫీజు రీయంబర్స్ మెంట్ , బకాయిలు,స్కాలర్ షిప్ లు ఇవ్వడం లేదు,బిసి విద్యార్థులకు పూర్తి ఫీజులు అమలు చేయడం లేదు ఈ డిమాండ్ల సాధనకై ఈనెల 30న హైదరాబాద్ ఇందిరా పార్క్ లో బీసీ విద్యార్థుల సమర శంఖారావంతో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థుల నాయకులు బుర్రా వంశీ,చెడపంగు నరేష్,ధరావత్ సిద్ధూ తదితరులు పాల్గొన్నారు.

 

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సిపిఎం నేతల అక్రమ అరెస్టు…. విడుదల

TNR NEWS

నేడు కోదాడలో మంత్రి పర్యటన

Harish Hs

సి ఎం సహాయనిది చెక్కుల పంపిణీ 

TNR NEWS

జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు….. రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి

TNR NEWS

అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు -వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD INDIA) వరంగల్ జిల్లా అధ్యక్షులు అడ్డ రాజు

TNR NEWS

హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి బిసి బాలురవసతి గృహాన్ని పరిశీలించిన. బీసీ యువజన సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు గడ్డం లక్ష్మీనారాయణ

TNR NEWS