Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

బేడ (బుడ్గ) జంగం కులాన్ని ఎస్సీ వర్గీకరణలో చేర్చడం అభినందనీయం

పిఠాపురం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాయి బేడ (బుడ్గ) జంగం కులాన్ని ఎస్సీ కులాల లిస్టులో చేరుస్తూ అసెంబ్లీ తీర్మానం చదివి వినిపించగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం నియోజకవర్గ శాసన సభ్యడు కొణిదల పవన్ కళ్యాణ్ దీనికి పూర్తీ సహాయ సహకారాలు అందించారు. వీరు ఇరువురికి తూర్పుగోదావరి జిల్లా బేడ (బుడ్గ) జంగం సంఘం అభినందనలు తెలియచేసింది. దాదాపు 12 సంవత్సరాల నుండి ఏవర్గానికి చెందుతామో తెలియని పరిస్థితులలో కులధృవీకరణ పత్రాలు లేక పిల్లలకు చదువులు, ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్న బేడ (బుడ్గ) జంగం కులానికి కూటమి ప్రభుత్వం వారి బాధలను అర్ధంచేసుకొని వారిని ఎస్సీ వర్గీకరణలోకి గ్రూపు ఏలో చేరుస్తూ తీసుకున్న నిర్ణయానికి తూర్పుగోదావరి జిల్లా  బేడ (బుడ్గ) జంగం సంఘం అధ్యక్షుడు వేములూరి రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి బోణం రవిశంకర్, కోశాధికారి పెదపాటి వెంకటరమణ మరియు కార్యవర్గ సభ్యులు వేములూరి నాగేశ్వరరావు, పేర్రాజు, లోకనాథం సూర్య ప్రకాష్, గోళ్ళ నాగేశ్వరరావు, తూము రాంబాబు కృతజ్ఞతలు తెలియజేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఏపీలో వాహనదారులకు పోలీసుశాఖ షాక్ – రేపటి నుంచి భారీ జరిమానాలు

స్వచ్ఛభారత్ కు 10 సంవత్సరాలు

TNR NEWS

వయోజన విద్యా సెంటర్స్ ప్రారంభోత్సవం

ఫోటోగ్రాఫర్ యూనియన్ అధ్యక్షుడిగా శేషు ఎన్నిక

Dr Suneelkumar Yandra

ఆధ్యాత్మిక చైతన్యమే సామాజిక చైతన్యానికి బీజం వేస్తుంది : పీఠాధిపతి – డాక్టర్ ఉమర్ ఆలీషా

TNR NEWS

శ్రీ దుర్గ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన మర్రెడ్డి

Dr Suneelkumar Yandra