Tnrnews.in
తెలంగాణ

మునగాల ఎంపీఓ గుండెపోటుతో మృతి

మునగాలమండల పంచాయతీ అధికారి(ఎంపీఓ)గా విధులు నిర్వర్తిస్తున్న దార శ్రీనివాస్(53) సోమవారం గుండెపోటుతో మృతిచెందారు.సోమవారం మండలంలోని తిమ్మారెడ్డిగూడెం గ్రామపం చాయతీ కార్యదర్శి జావీద్ ఆహ్వానం మేరకు చిలుకూరు మండలం జెర్రిపోతులగూడెంలో రంజాన్ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లారు. భోజనం అనంతరం బాత్రూమ్కు వెళ్లిన శ్రీనివాస్ గుండెపోటుకు గురికావడంతో పంచాయతీ కార్యదర్శులు హుటాహుటిన కారులో కోదాడకు తరలించారు. కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శ్రీనివాస్ స్వస్థలం హుజూర్ నగర్ కాగా కోదాడలో స్థిరనివాసం ఉంటున్నారు. ఎంపీఓ శ్రీనివాస్ మృతి పట్ల ఎంపీ డీఓ కె.రమేష్ దీనదయాళ్, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, పలువురు పంచాయతీ కార్యదర్శులు సంతాపం ప్రకటించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

*కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ ఆమోదిత దినోత్సవ వేడుకలు* ….

Harish Hs

ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి పనిచేయాలి. వికారాబాద్ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి. దిశ చైర్మన్, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి.

TNR NEWS

లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలి

TNR NEWS

అన్నను దర్శించుకున్న సినీ హీరో శ్రీకాంత్

TNR NEWS

ఉపాధ్యాయులు.,.. అంకితభావంతో పనిచేయాలి 

TNR NEWS

ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయినులను సన్మానించిన కాంగ్రెస్, సిపిఐ పార్టీ నేతలు 

TNR NEWS