Tnrnews.in
తెలంగాణ

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుల పాత్ర కీలకం ఆట పాటలు, చిలిపి పనులు కష్టం, సుఖం ఇలా ఏదైనా కాని మన వెన్నంటే ఉండి నేనున్నాను అంటూ ధైర్యం చెప్పేదే ఒక స్నేహం. ఆనందం, బాల్యం, స్మృతులు, కరచాలనాలు, చెమ్మగిల్లిన కళ్ళతో అలింగనాలు గురువుల మందలింపులు తలుచుకుంటూ ఒకసారి వయస్సు మరచి పోయి చిన్న పిల్లల కేరింతలతో తాడువాయి పాఠశాల అవరణం కోలాహలంగా మారింది. ఈ ప్రాంగణంలో అడుగు పెడుతూనే హోదాలను మరిచి ఒకరినొకరు ఆత్మీయంగా పలకరిస్తూ యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

మునగాల మండల పరిధిలోని తాడ్వాయి గ్రామంలో 2006-07 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పండుగగా మారింది.ఈ సమ్మేళనంలో తమ గురువుల బోధనలు తమ కుటుంబ పరిస్థితులు నాటి చిలిపి చేష్టలను క్రమశిక్షణ పేరుతో గురువుల దండనలు తలుచుకుంటూ సాగిన పూర్వ విద్యార్థుల ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఆడిన ఆటలు పాటలు అలరించాయి. వచ్చిన పూర్వ విద్యార్థులు పాఠశాల ఆవరణలో పొద్దు పోయే వరకు గడిపి బరువెక్కిన హృదయాలతో ఎవరి గమ్య స్థానాలకు వారు కదిలారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు

.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పేదల డబ్బా కోట్లకు నోటీసులు ఇవ్వడం అన్యాయం……

Harish Hs

అభయాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదానం…..   చిల్లంచర్ల హరికృష్ణ జ్ఞాపకార్థం అన్నదానం…

TNR NEWS

సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి 

TNR NEWS

గ్రూప్ III పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్

Harish Hs

నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి  మాదక ద్రవ్యాలు / డ్రగ్స్,గంజాయి సేవిస్తే కఠిన చర్యలు తప్పవు మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్

TNR NEWS

దహెగాం శాంతినికేతన్ పాఠశాలలో సావిత్రి బాయ్ ఫూలె జయంతి వేడుకలు

TNR NEWS