Tnrnews.in
తెలంగాణ

పిల్లల భాగస్వామ్యం అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర 

కోదాడ మండల పరిధిలోని అల్వాలపురం గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా అంగన్‌వాడీ కేంద్ర స్థాయిలో పిల్లల భాగస్వామ్యం అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచి పోతురాజు సత్యనారాయణ పాల్గొని మాట్లాడుతూ తల్లుల సహాయక బృందాలు, గర్భిణీ స్త్రీలు, 2 సంవత్సరాల లోపు పిల్లల తల్లులతో సమావేశం నిర్వహించి ఆ కుటుంబాల నుండి భర్తలను, తాతామామ్మలను ఆహ్వానించి వారికి అవగాహన కల్పించిన ఐసిడిఎస్ ప్రాజెక్టు వారికి ధన్యవాదాలు తెలిపారు. పోషణ, ఆరోగ్యం, వాష్, భద్రత, రక్షణ, బాధ్యతాయుతమైన పెంపకంపై దృష్టి సాధించాలని అన్నారు. పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పౌష్టిక ఆహారాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తల్లులు, తండ్రులు, సంరక్షకులతో ఆటల సెషన్‌లు నిర్వహించండం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచి మద్దెల మరియమ్మ, తల్లుల సూపర్వైజర్ డి రమణ, అంగన్వాడి టీచర్ సుహాసిని, వెంకటరమణ, పాపమ్మ ఆశాలు, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

బెజ్జుర్ మండలతహసీల్దార్ కు ఘోర అవమానం

TNR NEWS

తాటాకు చప్పులకు భయపడను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

TNR NEWS

విద్య ద్వారా పేదరికం నుంచి శాశ్వతంగా విముక్తి….. అదనపు కలెక్టర్ డి.వేణు మైనారిటీ సంక్షేమ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అదనపు కలెక్టర్

TNR NEWS

రైతుల వరి కొనుగోలు కోసం కలెక్టర్ కు వినతి పత్రం

TNR NEWS

డ్రగ్స్ సైబర్ నేరాల పైన అవగాహన

Harish Hs

ముగిసిన రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు

Harish Hs