Tnrnews.in
తెలంగాణ

స్వేరోస్ గ్రామ కమిటీ ఎన్నిక

మోతె : మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామంలో స్వేరోస్ గ్రామ నూతన కమిటీని స్వేరోస్ నెట్వర్క్ సూర్యాపేట జిల్లా కోశాధికారి జిల్లపల్లి శివకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షుడుగా నవిలే నరేష్, ప్రధాన కార్యదర్శిగా నవిలే నరేష్,ఉపాధ్యక్షులుగా పవన్ కళ్యాణ్, కోశాధికారిగా సైదులు, సోషల్ మీడియా ఇన్ఛార్జిగా మధు, విగ్నేష్, జాయింట్ సెక్రటరీగా రవి, అడ్వైజర్ గా గణేష్, కమిటీ సభ్యులుగా నరేష్, వీరబాబు, వినయ్, గణేష్, వినయ్ తదితరులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లపల్లి శివకృష్ణ మాట్లాడుతూ. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆలోచనలో నుంచి పుట్టిన స్వేరోస్ నెట్వర్క్ అక్షరం, ఆర్థికం,ఆరోగ్యం అనే నినాదంతో అణగారిన వర్గాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. స్వేరోస్ చీఫ్ కన్వీనర్ బల్గూరి దుర్గయ్య ఆదేశానుసారం మేరకు కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామ గ్రామాన స్వేరోస్ కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ఎన్నికైన నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వేరో సిద్ధాంతాలను పాటిస్తూ నెట్వర్క్ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. స్వేరోస్ సిద్ధాంతాలో అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో స్వేరోస్ మోతె మండల నాయకులు మేకల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈఓ

TNR NEWS

గుడ్ న్యూస్..త్వరలో పంచాయతీలకు పెండింగ్ బిల్లులు..!!

TNR NEWS

విద్యార్థులు క్రీడల్లో రాణించి సూర్యాపేట జిల్లాకు పేరు తేవాలి

Harish Hs

కంపు వాసన నరకయాతన… * డ్రైనేజీ కాల్వల తలపిస్తున్న సిసి రోడ్డు * నడవలేని స్థితిలో వార్డు ప్రజలు * సంవత్సరాలు గడుస్తున్న పట్టించుకోని అధికారులు 

TNR NEWS

ఎన్ ఆర్ ఎస్ కాలేజీలో ఎం ఎల్ ఏ పద్మావతి జన్మదిన వేడుకలు

TNR NEWS

మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త .. త్వరలో ఖాతాల్లోకి డబ్బులు!

TNR NEWS