Tnrnews.in
తెలంగాణ

దాడుల సంస్కృతిని ఖండిస్తున్నాం. _మద్నూర్ మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్

 

కామారెడ్డి మద్నూర్ మండలం నిన్న వికారాబాద్ జిల్లాలో జిల్లా అధికారులపై జరిగిన దాడిని ఖండిస్తూ ఈ దాడుల సంస్కృతి సరైంది కాదని మద్నూర్ మండల తహసీల్దార్ అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా, దుద్యాల మండలం, లగచర్ల లో ఫార్మా కంపెనీలకు భూ సేకరణ విషయంలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన జిల్లా కలెక్టర్ , అదనపు కలెక్టర్, తహసిల్దార్, రెవెన్యూ, తదితర అధికారులపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అని మద్నూర్ మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్ అన్నారు. దాడిని నిరసిస్తూ..మంగళవారం మద్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు బ్లాక్ రిబ్బన్ ధరించి సిబ్బందితో కలిసి నిరసన తెలిపారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ నిరసనలు శాంతియుతంగా చేయాలని, దాడుల వల్ల కేసులు అయ్యి జీవితాలు నాశనం చేసుకోవడం కన్న ప్రజలు చెప్పదలచుకున్నది ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన వారధిగా ఉన్న అధికారులకు చెప్పాలని అన్నారు. ఇలాంటి సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం సిబ్బందికి రక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మునగాల సర్వీస్ రోడ్డు, గణపవరం రహదారిపై దుమ్ములేకుండా చర్యలు తీసుకోవాలి కోదాడ ఆర్డిఓకు వినతిపత్రం అందజేసిన మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సామాజిక కార్యకర్త గంధం సైదులు

TNR NEWS

ఘనంగా భజరంగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాధుని శోభయాత్ర

TNR NEWS

మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి  ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి 

TNR NEWS

ఆచార్య చింతకింది సద్గుణకి ‘కల్చరల్ ప్రిజర్వేషన్ అండ్ నాలెడ్జ్ ఎక్సలెన్స్ అవార్డు’

TNR NEWS

కోదాడ అభివృధే ఉత్తమ్ దంపతుల ద్వేయం

TNR NEWS

*మొంథా తుపాన్ వలన నష్టపోయిన రైతులను ఆదుకోవాలని నవంబర్ 3న కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి*   తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS