Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

వేమూరి సత్యనారాయణ సేవలు అభినందనీయం. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు నన్నూరి నర్సిరెడ్డి.

మునగాల మండల పరిధిలోని నరసింహా పురం గ్రామం లో. శ్రీ కోదండరామ స్వామి తిరు కళ్యాణ మహోత్సవం సందర్భంగా. శ్రీ కోదండ రామస్వామి సేవాసమితి సాంస్కృతిక & సామాజిక సేవ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వేమూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో 14 ఏళ్లుగా వివిధ గ్రామాలలో పేద కుటుంబాలకు చెందిన ‌ వృద్ధులకు మహిళలకు వికలాంగులకు దాతల సహకారంతో వస్త్ర దాన కార్యక్రమం చేయడం అభినందనీయమని అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా జరిగే కళ్యాణాన్ని పురస్కరించుకొని ఇలా పేదలకు ఉచిత వస్త్రధాన కార్యక్రమం నిర్వహించడమే కాకుండా పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం అన్యాక్రాంతమైన దేవాలయ భూముల సంరక్షణకై పోరాటం చేయడం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టే వారిని ప్రతి ఒక్కరూ పార్టీలకు రాజకీయాలకతీతంగా ఆదర్శంగా తీసుకోవాలని ఇలాంటి కార్యక్రమాలకు ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాలుపంచుకునే అవకాశం కల్పించిన సత్యనారాయణకు ప్రత్యేక కృతజ్ఞతలు అని. ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని. ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా అవకాశం దొరకటం అదృష్టమని అదేవిధంగా తెలంగాణలో ఉన్న పురాతన దేవాలయాలకు పూర్వ వైభవం తెచ్చేందుకు టీటీడీ కమిటీ తరఫున. చర్చించి అవకాశ ఉన్నంతవరకు ఆలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో సామాజిక సేవాస్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సమాజ హితం కోసం సనాతన ధర్మం కోసం పాటుపడాలని. అదేవిధంగా నరసింహ పురం లో ఉన్న శ్రీ కోదండరామ స్వామి దేవాలయం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు ముందుగా. గ్రామానికి విచ్చేసిన. నన్నూరి నర్సిరెడ్డి కి. గ్రామానికి చెందిన సేవాసమితి అధ్యక్షులు వేమూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో పూలమాలలతో శాలువాతో ఘనంగా స్వాగతం పలికి కోలాట బృందాలతో సాంప్రదాయ పద్ధతిలో ఊరేగింపుగా దేవాలయం వద్దకు రావడం జరిగింది తదుపరి దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ ముడుంబై

  • శేషాచార్యులు. ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి. శేష వస్త్రం సమర్పించారు తదుపరి. పేదలకు ఉచిత వస్త్ర దానం ఏర్పాటుచేసిన వేదిక వద్ద నుంచి. వృద్ధులకు మహిళలకు వికలాంగులకు ఆయన చేతుల మీదుగా వస్త్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నరసింహాపురం ఆకు పాముల కోదండ రామాపురం ముకుందాపురం చిలుకూరు మండలం కట్టకమ్మ గూడెం గ్రామాలకు చెందిన 500 మంది వృద్ధులు మహిళలు వికలాంగులకు వస్త్ర పంపిణీ చేయడం జరిగింది ఇంకా ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షులు వేమూరి సత్యనారాయణ. కసిరెడ్డి శేఖర్ రెడ్డి వస్త్రధానానికి సహకరించిన దాతలు విద్యాసంస్థల అధినేత నీలా సత్యనారాయణ కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పందిరి నాగిరెడ్డి. ప్రముఖ రంగస్థల కళాకారులు గుంటి పిచ్చయ్య విలాసకవి రమేష్ రాజు. సేకు శ్రీనివాసరావు .బారి లక్ష్మయ్య. రేవూరి బాబు అల్లి చిన్న రామయ్య. అల్లి చిన్న వెంకయ్య. మారేపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు

Related posts

గ్రామ పంచాయతీ నిర్లక్ష్యం ప్రజలకు ప్రాణ సంకటం…

TNR NEWS

ప్రజాసేవకు విరమణ ఉండదు

Harish Hs

ఆకాశమే హద్దుగా ప్రతి మహిళ ఎదుగాలే…

TNR NEWS

జాతీయ రహదారిపై ట్రాక్టర్ బోల్తా – వ్యక్తి మృతి

TNR NEWS

సుబ్బరామయ్య సేవలు చిరస్మరణీయం…..  కోదాడ అభివృద్ధిలో సుబ్బరామయ్య చేసిన కృషి అభినందనీయం……..  కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు…..

TNR NEWS

గజ్వేల్ లో ఘనంగా నీలం మధు ముదిరాజ్ జన్మదిన వేడుకలు

TNR NEWS