Tnrnews.in
తెలంగాణ

వేములవాడలో అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి స్వీకారం

 

రాజన్న జిల్లా: నవంబర్ 20

రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలో ఇవాళ సీఎం రేవంత్‌ రెడ్డి తొలిసారి పర్యటిస్తున్నారు. దాదాపు 500 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ది కార్యక్ర మాలకు శ్రీకారం చుట్టారు.

 

తొలుత హెలికాప్టర్లో వేములవాడకు చేరుకున్న సీఎం రేవంత్, వేములవాడ లో రాజన్నను దర్శించుకు న్నారు. అనంతరం ఆలయాభివృద్ది పనులు, రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని వర్చువ ల్‌గా ప్రారంభించారు.

రూ. 235 కోట్లతో 4 వేల 696 మిడ్ మానేరు రిజర్వాయర్ నిర్వాసితు లకు నిర్మించే ఇందిరమ్మ ఇళ్ల పనులకు భూమిపూజ చేశారు. రూ. 35 కోట్లతో చేపట్టే అన్నదాన సత్రం, రూ. 26 కోట్లతో నిర్మించిన ఎస్పీ భవనం, వర్కింగ్ ఉమెన్ హాస్టల్ భవనాన్ని సీఎం రేవంత్‌ ప్రారంభించారు.

ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా గల్ఫ్ దేశాల్లో మరణించిన 17 కుటుంబాలకు రూ.85 లక్షల పరిహారం పంపిణీ చేయనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బహిరంగా సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

*మాలల సింహాగర్జనను విజయవంతం చేయాలి* ● సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని పలు గ్రామాల్లో సింహగర్జన వాల్ పోస్టల్ ఆవిష్కరణ

TNR NEWS

గుండాల రాములుకు జోహార్లు

TNR NEWS

రైతు భరోసా కు ఎగనామం పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం  టిఆర్ఎస్ ప్రభుత్వం లోని రైతులు కళ్ళలో ఆనందం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

TNR NEWS

మహిళా ధీరత్వానికి ప్రతీక చాకలి ఐలమ్మ

Harish Hs

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలి

TNR NEWS

విద్యార్థులు చట్టాలను తెలుసుకోవాలి

Harish Hs