కంగ్టి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఎంపీడీవో సత్తయ్య శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నెలకొన్న సమస్యలు, భోజన వసతి పై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థులకు ఏర్పాటు చేస్తున్న వంటలను, కూరగాయలను పరిశీలించి,రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలన్నారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. విద్యార్థులు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.పదవ తరగతి విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు.తదనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.కార్యక్రమంలో ఎంపీవో సుభాష్, ప్రిన్సిపాల్ విజయలక్ష్మి , ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
