Tnrnews.in
తెలంగాణ

తెలంగాణలో పంచాయతీ కార్మికులకు ఇక అకౌంట్లలో జీతాలు..!!_ ఇప్పటికే బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించిన పంచాయతీ రాజ్ శాఖ గతంలో గ్రామ పంచాయతీల నుంచి చెల్లింపులు.. పలు ఇబ్బందులు జనవరి నెల నుంచే అకౌంట్లో వేతనాలు.. తీరనున్న 48 వేల మంది కష్టాలు

హైదరాబాద్ : రాష్ట్రంలోని పంచాయతీ పారిశుధ్య కార్మికులకు ఇక నుంచి నెలనెలా జీతాలు వారి అకౌంట్లోనే పడనున్నాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా పారిశుధ్య కార్మికుల బ్యాంకు ఖాతా వివరాలు సేకరించింది. ఈ నెల నుంచే వారి జీతాలను అకౌంట్లలో జమచేయాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. గతంలో వీరికి గ్రామ పంచాయతీల నుంచి జీతాలు ఇచ్చేవారు. దీనివల్ల సమస్యలు తలెత్తేవి. పంచాయతీ కార్యదర్శులు సమయానికి జీతాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడేవారు. వారి కుటుంబాలను పోషించడం కష్టంగా మారేది. ఇప్పుడు నేరుగా అకౌంట్లోనే డబ్బులు జమకానుండడంతో పారిశుధ్య కార్మికులు ఏండ్లుగా ఎదుర్కొన్న సమస్య పరిష్కారం కానున్నది.

 

రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల వివరాలను పంచాయతీరాజ్ శాఖ సేకరించినట్టు తెలిసింది. వాటిని ఈ- పంచాయత్ వెబ్సైట్లో నమోదు చేసినట్టు సమాచారం. రాష్ట్రంలో 32 జిల్లా పరిషత్లు, 620 మండల పరిషత్లు, 12,769 గ్రామ పంచాయతీల్లో 48 వేల పైచిలుకు మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. దీర్ఘకాలికంగా సేవలందిస్తున్నప్పటికీ వారి వివరాలు ప్రభుత్వం వద్ద లేవు. దీంతో సేవలకు సంబంధించి సీఎం, మంత్రుల సమీక్షల సందర్భంగా స్పష్టమైన సమాచారాన్ని ఉన్నతాధికారులు ఇవ్వలేక పోతున్నారు. జీతాలు సరిగా ఇవ్వడం లేదని, పనిభారం ఎక్కువగా ఉందని కొందరు కార్మికులు వెళ్లిపోతుండగా.. వారి స్థానంలో కొత్తవారిని తీసుకోవడం లేదు. సరైన సంఖ్య తేలక ఏటా జీతాల చెల్లింపులకు బడ్జెట్ కేటాయింపులు సరిగా జరగడం లేదు. ఒక్కోసారి 3 నెలలపాటు జీతాలు అందట్లేదు. ఈ సమస్యల నేపథ్యంలో వారందరి వివరాలు పక్కాగా నమోదు చేయాలని పంచాయతీరాజ్శాఖ నిర్ణయించింది.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

జాబితాపూర్ అట్టహాసంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు.  మాజీ ఎంపీటీసీ చిత్తరి స్వప్న శ్రీనివాస్

TNR NEWS

ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి. జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్

TNR NEWS

హుస్సేనమ్మకు నివాళులు అర్పించిన పలువురు బిజెపి నాయకులు

TNR NEWS

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్ ) పేరుతో ఓటు హక్కులను హరించే చర్యలను విరమించాలి  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి  డిమాండ్

TNR NEWS

డబల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించాలి.  సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్ 

TNR NEWS

వ్యవసాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే భేటీ

TNR NEWS