Tnrnews.in
తెలంగాణ

జిల్లా పోలీస్ కార్యాలయం లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి

వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో 76వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ కె.నారాయణ రెడ్డి, జిల్లా పోలీస్ కార్యాలయం పైన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా ప్రజలు,పోలీసు అధికారులు మరియు సిబ్బందికి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఆకాంక్షిస్తూ స్వేచ్చ, స్వాతంత్ర్యాల వెనక ఎంతో మంది పోరాటయోదుల త్యాగం దాగి ఉన్నదని గుర్తు చేసారు. మన వంతు భాద్యతగా దేశసేవ కొరకు పాటుపడాలని, పోలీసు అధికారులు సిబ్బంది తమ విధులను భాద్యతాయుతంగా నిర్వహించి పోలీస్ వ్యవస్థకు మంచి పేరు,ప్రతిష్టలు తీసుకురావడానికి కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ శ్రీ టి‌వి.హనుమంత్ రావు గారు,ఏ‌ఓ జోతిర్మని, వికారాబాద్ డి‌ఎస్‌పి శ్రీనివాస్ , డి‌సి‌ఆర్‌బి డి‌ఎస్‌పి జానయ్య , ఏ‌ఆర్ డి‌ఎస్‌పి వీరేష్ , ఏ‌ఆర్ డి‌ఎస్‌పి వీరేశ్, డి‌ఎస్‌బి ఇన్స్పెక్టర్ డి‌వి‌పి రాజు ,ఆర్‌ఐ అంజాత్ పాషా , కమ్మునికేషన్ ఇన్స్పెక్టర్ టి.శ్రీను తదితరులు పాల్గొనడం జరిగింది.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

దళిత స్పీకర్ పై దాడి ప్రయత్నించిన బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేల పై చర్య తీసుకోవాలని…. కాంగ్రెస్ నాయకుల డిమాండ్

TNR NEWS

శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు 

TNR NEWS

క్రీడలు మానసిక ఉల్లాసానికి ప్రతీకలు

Harish Hs

అట్టహాసంగా మునగాల విజ్ఞాన మహోత్సవం

TNR NEWS

ఎస్బిఐ బ్యాంకు ఉద్యోగుల ఆధ్వర్యంలో రక్తదానం

Harish Hs

పాస్టర్ ప్రవీణ్ పగడాల అకాల మరణం పట్ల క్రైస్తవుల ఆధ్వర్యంలో సంతాపం

TNR NEWS