Tnrnews.in
తెలంగాణరాజకీయం

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

సూర్యాపేట: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు వెంటనే అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శిమల్లు నాగార్జునరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్న సిపిఎం పార్టీ రాష్ట్ర నాలుగో మహాసభలో హాజరైన ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ జనవరి 26న రైతులందరికీ రైతు భరోసా బ్యాంకులో జమ చేస్తానని చెప్పి నేటికీ జమ చేయకుండా రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. వ్యవసాయ కార్మికులకు ఇస్తానన్న 12 వేల రూపాయలను ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని కోరారు. అర్హులైన పేదలందరికీ ఇండ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. మహిళలకు ఇస్తామన్న 25 వందల రూపాయలు, ప్రభుత్వం పెంచుతామన్న పింఛన్లు వెంటనే పెంచాలన్నారు. వచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయకపోతే భవిష్యత్తులో ప్రజలందరిని సమీకరించి ప్రజా పరాటాలను నిర్మిస్తామని హెచ్చరించారు. ఈ మహాసభలు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నె మ్మాది వెంకటేశ్వర్లు, కోలిశెట్టి యాదగిరిరావు, ములకలపల్లి రాములు, పారేపల్లి శేఖర్రావు నాగారపు పాండు, మట్టిపల్లి సైదులు ,కోట గోపి ,చెరుకు ఏకలక్ష్మి ప్రతినిధులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

రాంసాని పల్లి చౌరస్తా వద్ద ఎక్స్‌ప్రెస్‌ స్టాప్‌     హర్షం వ్యక్తం చేస్తున్న 5 గ్రామాల ప్రజలు, విద్యార్థులు

TNR NEWS

పాస్టర్ ప్రవీణ్ పగడాల అకాల మరణం పట్ల క్రైస్తవుల ఆధ్వర్యంలో సంతాపం

TNR NEWS

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

TNR NEWS

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి – సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలి – ఎవరో చెప్పే మాయ మాటలు విని మోసపోవద్దు – సీనియర్ జూనియర్ అని చూడకుండా స్నేహభావంతో కలిసిమెలిసి ఉండాలి – గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి

TNR NEWS

ఎస్ డబ్ల్యూ ఎఫ్ తోనే ఆర్టీసి కార్మికులకు న్యాయం   సూర్యాపేట డిపో విస్తృత స్థాయి సమావేశంలో రీజియన్ కార్యదర్శి బత్తుల సుధాకర్  ఎస్ డబ్ల్యూ ఎఫ్ లో పలువురు కార్మికుల చేరిక

TNR NEWS

ఘనంగా ఎస్.ఆర్. శంకరన్ ఐఏఎస్ జయంతి

TNR NEWS