Tnrnews.in
తెలంగాణవిద్య

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

కోదాడ పట్టణ పరిధిలోని బాలాజీ నగర్ లో గల ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో శుక్రవారం స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాటలను బోధించారు.విద్యార్థులు కలెక్టర్ గా,జిల్లా విద్యాధికారిగా, ప్రధానోపాధ్యాయులుగా,ఉపాధ్యాయులుగా అలరించారు. ఈ సందర్భంగా వసతిగృహ సంక్షేమ అధికారి, ప్రధానోపాధ్యాయురాలు కే నాగజ్యోతి మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుండి లక్ష్యాలను ఏర్పరుచుకొని వాటి సాధన కొరకు నిరంతరం కృషి చేయాలి అన్నారు. తమపై తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాలను నెరవేర్చాలన్నారు. వసతి గృహాల్లో ప్రభుత్వం మెరుగైన వసతులు కల్పిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు చదువులో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఉషారాణి, సుజాత, రేణుక, పద్మాబాయి, స్వరూప, రేణుక, ప్రియాంక, స్వాతి, నాగేశ్వరరావు, సరిత, లలిత విద్యార్థులు పాల్గొన్నారు………

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మౌలిక సమస్యలు పరిష్కరించాలి.  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెల్లిసైదులు

TNR NEWS

జాన్ పహాడ్ ఉర్సు గంధం ఊరేగింపు ప్రారంభించిన మంత్రి

TNR NEWS

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

TNR NEWS

బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మొదటి సంత్సరము విద్యార్థీ హత్మహత్య

TNR NEWS

తొర్రూర్ అయ్యప్ప స్వాముల అన్నదాన ప్రభు కార్యక్రమంలో పాల్గొన్న పాలకుర్తి ఎమ్మెల్యే 

TNR NEWS

అయ్యప్ప దేవాలయం లో అయ్యప్ప స్వామికి నెయ్యితో అభిషేకం 

TNR NEWS