Tnrnews.in
తెలంగాణ

ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యంకు బోనస్ డబ్బులు వెంటనే చెల్లించాలి

ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి రెండు నెలలు గడుస్తున్నా నేటి వరకు బోనస్ డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తమ్మరకు చెందిన పలువురు రైతులు రైతు సంఘం సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు బొల్లు ప్రసాద్ ఆధ్వర్యంలో ఆర్డీవో సూర్యనారాయణ ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ లో రైతులు పండించిన పంటకు ప్రభుత్వం బోనస్ డబ్బులు ఇస్తామని ప్రకటించడంతో తామంతా సహకార సంఘాల ద్వారా ప్రభుత్వానికి ధాన్యం విక్రయించామని నేటికీ రెండు నెలలు గడుస్తున్నా బోనస్ డబ్బులు ఇవ్వకపోవడంతో గ్రామాల్లో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు బోనస్ డబ్బులు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సామినేని సతీష్, కనగాల పూర్ణచందర్ రావు, మాతంగి ప్రసాద్, మందారపు వెంకటేశ్వర్లు, సైదులు, వెన్నబోయిన శ్రీను, దంతాల గోపి,శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు……

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైన విద్యార్థి

TNR NEWS

ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు

TNR NEWS

బ్యాంకు అకౌంట్లు.. పాన్‌ నంబర్లు ఇవ్వండి.. ఎక్సైజ్‌ శాఖకు ఏసీబీ నోటీసులు

TNR NEWS

వాజ్ పాయ్ శతజయంతి ఉత్సవాలు

TNR NEWS

పొగ మంచు కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు

Harish Hs

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చిత్రపటానికి ఘన నివాళి అర్పించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ

TNR NEWS