Tnrnews.in
తెలంగాణ

జర్నలిస్ట్ హరికిషన్ ఆశయ సాధనకు కృషి చేస్తాం

ప్రజా సమస్యలపై తన కలంతో నిరంతరం అక్షర పోరాటం చేసి అనేకమంది బాసటగా నిలబడి, విప్లవాత్మక భావాలతో ప్రయాణం కొనసాగించిన నమస్తే తెలంగాణ దినపత్రిక రిపోర్టర్ చిల్లంచర్ల హరికిషన్ మనమధ్య లేకపోవడం బాధాకరమని కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు అన్నారు. మునగాల మండల కేంద్రంలో మంగళవారం హరికిషన్ సంతాప సభలో వారు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం రఘు మాట్లాడుతూ… విప్లవాత్మక భావాలు కలిగిన హరికిషన్ ఆశయ సాధనకై తప్పనిసరిగా కృషి చేస్తామన్నారు. మునగాల మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో మంచి పేరు తెచ్చుకోవడం అభినందనీయమన్నారు. సీనియర్ జర్నలిస్టుగా ప్రస్తుతం జర్నలిజంలోకి వస్తున్న మిత్రులకు అనేక సలహాలు సూచనలు అందించే వారిని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట జర్నలిస్టు మిత్రులు, చెరుకుపల్లి శ్రీకాంత్, కె వాసు, లావుడియా రమేష్,పగడల వాసు ,నెలమరి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

350,999కు ఫ్యాన్సీ నెంబర్ దక్కించుకున్న రామినేని శ్రీనివాసరావు

TNR NEWS

తెలంగాణ సాయుధ పోరాట వీరనారి మల్లు స్వరాజ్యం

TNR NEWS

ఉమ్మడి నల్లగొండ పోలీస్ సిబ్బందికి మిర్యాలగూడలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించిన కొన్ని మెడికల్ ప్రైవేటు సంస్థలు

Harish Hs

ప్రవీణ్ పగడాల మృతి క్రైస్తవ్యానికి తీరని లోటు

Harish Hs

సిపిఎం సూర్యాపేట జిల్లా మహాసభ లను జయప్రదం చేయండి

TNR NEWS

స్వేరో కోర్ ను బలోపేతం చేయడమే లక్ష్యం

Harish Hs