Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

పిఠాపురం నియోజకవర్గానికి చెందిన యువకుడు దర్శకత్వంలో “శివాజ్ఞ”

పిఠాపురం : శివ పరమాత్మ క్రియేషన్స్ బ్యానర్ లో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో భారీగా విడుదలైన ఆధ్యాత్మిక చలన చిత్రం “శివాజ్ఞ”. ఈ చిత్రం భక్తి, జ్ఞాన, వైరాగ్యాలతో రూపొందించారు. శివ పరమాత్మ జ్ఞానాన్ని, రాజయోగ విధానాన్ని అందరికీ తెలియజేయాలనే సదుద్దేశంతో ఈ చిత్రాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చారు. ఈ చిత్రానికి పిఠాపురం నియోజకవర్గం మల్లాం గ్రామానికి చెందిన వి.ఎస్.వి.వి.మణికంఠ దర్శకత్వం వహించారు. స్వతహగానే ఆధ్యాత్మిక ఆలోచనలు కలిగిన మణికంఠ ఈ చిత్రాన్ని భక్తిరస దృశ్యకావ్యంగా తెరకెక్కించారు. ఈ చిత్రం విడుదలైన మొదటి ఆట నుంచే ప్రేక్షకులకు హృదయాలలో జ్ఞానం నింపుతూ మంచి విజయంతో దూసుకుపోతుంది. మంచి ఆధ్యాత్మిక చిత్రం దర్శకత్వం వహించిన వి.ఎస్.వి.వి.మణికంఠకు పిఠాపురం నియోజకవర్గానికి చెందిన పలువురు అభినందనలు తెలియజేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

5న రెల్లికులస్థుల మహా పాదయాత్ర

ఆరోగ్య భీమా ప్రీమియంపై జిఎస్టి భారం తగ్గించాలి – పౌర సంక్షేమ సంఘం డిమాండ్

Dr Suneelkumar Yandra

పిఠా‘‘పుర’’ంలో ఎన్నికల కోడ్‌ వర్తించదా…!? – చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు

Dr Suneelkumar Yandra

మృగశిర కార్తె సందర్భంగా పశ్చిమ గోదావరిలో ఆక్వా విందు

TNR NEWS

మట్టి విగ్రహాలు పంపిణీ చేసిన ఆదర్శ్ కళాశాల

Dr Suneelkumar Yandra

అనంతపురం జిల్లాలో పర్యటించనున్న జగన్

TNR NEWS