Tnrnews.in
తెలంగాణ

మానసిక ప్రశాంతతకు యోగా దివ్య ఔషధం

ప్రతీ ఒక్కరిలో మానసిక ప్రశాంతత పెంచేందుకు యోగా దోహద పడుతుందని,

మానసిక ప్రశాంతతకు దోహదమైన యోగాసనాలు, ధ్యానంతో ఒత్తిడిని తట్టుకొని రక్తపోటుని నివారించుకోవాలని మునగాల మండల ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ అన్నారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మునగాల మండలం ఆకుపాముల గ్రామంలో నిర్వహించిన యోగా డే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు..మారిన జీవన అలవాట్లు, ఆహారంతో వస్తున్న అనేక మానసిక, శారీరక అనారోగ్యాలన్నింటి నుండి బయట పడాలంటే క్రమం తప్పకుండా యోగా చేయడమే పరిష్కారం అన్నారు.జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్ల నియంత్రణ, శారీరక వ్యాయాయం,మానసిక ప్రశాంతత చేకూర్చే యోగాసనాలు,ధ్యానం చేయడం ద్వారా రక్తపోటును నియంత్రించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.యోగాతో శారీరకంగా,మానసికంగా మార్పులు రావడంతో పాటు ఏకాగ్రత పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో శైలజ,ఈసీ కళ్యాణ్,టిఏ శ్రీధర్, పంచాయతీ కార్యదర్శి నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

వావ్ ” సిద్దిపేట ట్యాంక్ బండ్… డెనోసార్ పార్క్.. సిద్దిపేట కోమటి చెరువు పర్యాటకను మెచ్చిన జర్మనీ పర్యాటక బృందం

TNR NEWS

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

TNR NEWS

అర్హులైన పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇవ్వాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో తీసిన గుంతలను వెంటనే పూడ్చాలి కొత్త రోడ్లు వేయాలి సిపిఎం 

TNR NEWS

రేపాల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు డీసీపీ నీ ఆహ్వానించిన ఆలయ చైర్మన్

TNR NEWS

ఘనంగా ఎస్.ఆర్. శంకరన్ ఐఏఎస్ జయంతి

TNR NEWS

ఉపాధ్యాయులకు ఘన సన్మానం

TNR NEWS