Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

మెరుగైన ప్రజా జీవితానికి మెరుగైన మౌలిక సదుపాయాలె పునాది

మెరుగైన ప్రజా జీవితానికి మెరుగైన మౌలిక సదుపాయాలె పునాది

* ప్రభుత్వం ప్రజా అవసారాన్ని గుర్తించి పనిచేస్తుంది అంటున్న కూటమి నాయకులు.
* సత్యవేడు మండల కేంద్రంలో పది లక్షల ఉపాధి నిధులతో సిమెంటు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

సత్యవేడు మండల కేంద్రం నందు 10 లక్షల ఉపాధి నిధులతో సిమెంటు రోడ్డు నిర్మాణానికి ఆదివారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించడమైనది.
పల్లె పండుగలో భాగంగా సత్యవేడు మండల కేంద్రంలోని ఉలవలచేను ప్రాంతమునకు వెళ్లే ప్రధాన రోడ్డు మార్గం గత అనేక సంవత్సరాలుగా సిమెంట్ రోడ్డు నిర్మాణానికి నోచుకోక గుంతలు రాళ్ళ మధ్య నడిచేవారికి వాహనదారులకు ఇబ్బందికరంగా ఉంటూ వచ్చిన తరుణంలో అనేకసార్లు పత్రిక ముఖంగా స్థానికులు తమ గోడు వెళ్లబుచ్చినప్పటికిని గతంలో ఈ రోడ్డు నిర్మాణ విషయంలో నామ మాత్రపుచర్యలే ఉంటువచ్చినది, నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం పల్లె పండుగలో భాగంగా ఐదు లక్షల రూపాయల ఉపాధి నిధి వ్యయంతో ఈ రోడ్డును నిర్మించడానికి భూమి పూజ నిర్వహించడమైనది, అదేవిధంగా సత్యవేడు మండల కేంద్రంలోని దళవాయిఅగ్రహారానికి చెందిన నాగాలమ్మ గుడి వద్ద ఉన్న రోడ్డును కూడా ఐదు లక్షల ఉపాధి నిధులతో నిర్మించడం కొరకై న భూమి పూజ నిర్వహించడమైనది. ఈ సందర్భంగా టిడిపి మండల అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, టిడిపి టౌన్ ప్రెసిడెంట్ శన్ముగం, వీకేఎన్ పరమశివం, స్థానిక ఎంపీడీవో చంద్రశేఖర్ లు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ నిర్వహించారు, ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం ప్రజల యొక్క జీవనశైలిలో ఉన్నత ప్రమాణాలను జోడించే దిశగా ప్రతి అడుగు వేస్తుందని అందులో భాగమే మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన అని సూచించారు, దీనిని అనుసరించి ఎంపీడీవో చంద్రశేఖర్ సూచిస్తూ ప్రజావసరాల దృష్ట్యా ప్రభుత్వ నిధులతో నిబంధనల మేరకు సిమెంట్ రోడ్లు నిర్మించబడుతుందని సూచించారు ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఇబ్రహీం, పంచాయితీ కార్యదర్శి మునిరవికుమార్, టిడిపి సీనియర్ నాయకులు హేమభూషణం, రాధాకృష్ణ, శశి నాయుడు, ఎక్స్ ఎంపిటిసి అమాస, కృష్ణ, మునుపటి ఎంపీటీసీ మునిరత్నం, మునిరత్నం, వాసు వైకాపా నాయకులు పంచాయతీ సర్పంచి భర్త బెల్ట్ రమేష్ లు పాల్గొన్నారు.

Related posts

ఉగాది వేడుకల్లో పాల్గొన్న గౌరీ నాయుడు

Dr Suneelkumar Yandra

సుదూరప్రాంతాల నుండి ఆవిర్భవసభకు వచ్చేవారికి జ్యోతుల భోజనాల ఏర్పాటు

Dr Suneelkumar Yandra

పిఠాపురంలో చేయూత నిత్యాన్నదానం ప్రారంభం

Dr Suneelkumar Yandra

ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో సినిమా ట్రైలర్ ఆవిష్కరణ

TNR NEWS

ఘనంగా కుక్కుటేశ్వరుడి శ్రీ పుష్ప యాగం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం

TNR NEWS