Tnrnews.in
తెలంగాణ

కార్యదర్శులు అప్పులపాలు..!!

 

పంచాయతీ కార్యదర్శులు అప్పుల పాలవుతున్నారు. గ్రామ పంచాయతీలో పాలకవర్గాల కాలపరిమితి తీరడంతో నిర్వహణ భారమంతా పంచాయతీ కార్యదర్శులపైననే పడింది.

 

ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో 10 నెలలుగా కార్యదర్శులు అప్పులు తెచ్చి పనులు చేయిస్తున్నారు. ప్రధానంగా బ్లీచింగ్‌, వీధి దీపాలు, మోటార్ల మరమ్మతు, ట్రాక్టర్‌ డీజిల్‌ తదితర ఖర్చులను సొంతంగా భరించాల్సి వస్తుంది.

 

*జిల్లాలో 844 పంచాయతీలు*

 

జిల్లాలో 844 గ్రామ పంచాయతీలున్నాయి. పంచాయతీలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక నిధులు వచ్చాయి. ఎన్నికల ముందు నుంచే రాష్ట్ర నిధులు ఆగిపోయాయి. పంచాయతీల్లో చేపట్టాల్సిన అత్యవసర పనులకు సర్పంచ్‌లు అప్పులు తెచ్చి నిర్వహించారు. ఫిబ్రవరి 2వ తేదీతో సర్పంచ్‌ల పదవీకాలం ముగిసిపోయింది. ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. కొత్త ప్రభుత్వం ఇప్పటి వరకు పంచాయతీలకు పైసా నిధులు ఇవ్వలేదు. దీంతో అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.

 

*రూ.25 కోట్ల వరకు ఖర్చు*

గ్రామ పంచాయతీల్లో అత్యవసరమైన పనులు వెంటనే చేపట్టాలని ప్రభుత్వం చెబుతోంది. ప్రత్యేక అధికారులను నియమించింది కానీ పైసలు మాత్రం ఇవ్వడం లేదు. దీంతో పంచాయతీ కార్యదర్శులే గ్రామాల్లో పనులకు సొంతంగా డబ్బులు వెచ్చిస్తున్నారు. పది మాసాల నుంచి నిధులు రాకపోవడంతో వారంతా అప్పులపాలవుతున్నారు. గతంలో సర్పంచ్‌లు ఉన్న సమయంలో అన్నీ వారే చూసుకునేవారు. ఇప్పుడు ఆ భారం కార్యదర్శులపైనే పడింది. చిన్న పంచాయతీల్లో అయితే.. రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు, పెద్ద పంచాయతీల్లో రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఇలా జిల్లాలో కార్యదర్శులు సుమారు రూ.25 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

*ఫ 10 నెలలుగా పంచాయతీలకు ఆగిన నిధులు*

*ఫ అత్యవసర పనులకు సొంతంగానే ఖర్చు*

 

ఫ నిధులు విడుదల చేయాలని ప్రభుత్వానికి వేడుకోలు

 

*నిధులు ఇవ్వాలని విన్నవించాం*

 

పంచాయతీ కార్యదర్శులు అప్పులు తెచ్చి గ్రామాల్లో పనులు చేస్తున్నారు. నిధులు విడుదల చేయాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్‌, డీపీఓ, పంచాయతీ అధికారికి తమ సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రాలు సమర్పించాం. ప్రభుత్వం కూడా త్వరలోనే నిధులు ఇస్తానని సంఘ నేతలకు హామీ ఇచ్చింది. త్వరగా ఇవ్వాలని కోరుతున్నాం.

– *ఖాసీం, టీఎన్‌జీఓ పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు*

కార్యదర్శులు అప్పులపాలు!

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

జాతి నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం

TNR NEWS

శాంతి భద్రతల పరిరక్షణక కోసమే కార్డెన్ సెర్చ్

TNR NEWS

ఘనంగా సావిత్రి బాయి పూలే జయంతి 

TNR NEWS

త్వరలోనే HIV బాధితులకు కొత్త పెన్షన్లు: సీతక్క

TNR NEWS

వ్యవసాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే భేటీ

TNR NEWS

కమ్యూనిస్టుల పోరాట ఫలితమే శ్రీరామ్ సాగర్ రెండవ దశ నిర్మాణం…  శ్రీరామ్ సాగర్ రెండవ దశకు మాజీ పార్లమెంటు సభ్యులు కమ్యూనిస్టు నేత భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు పెట్టాలి.  రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెడతామని ముఖ్యమంత్రి ప్రకటించిన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు డిమాండ్

TNR NEWS