Tnrnews.in
తెలంగాణ

షిరిడి నగర్ కాలనీ వాగు లో గుర్రపు డెక్కను పరిశీలించిన మాజీ సర్పంచ్ ఎర్నేని

కోదాడ పట్టణ పరిధిలోని షిరిడి నగర్ కాలనీవాసులకు వాగు నుండి ఇబ్బందులు కలగకుండా కృషి చేస్తానని కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు. బుధవారం షిరిడి సాయి నగర్ కు వచ్చే వాగులో గుర్రపు డెక్కను ఆయన పరిశీలించి మాట్లాడారు. తమ్మర వాగు లో ఉన్న గుర్రపు డెక్క ఈ వాగులో వేయడం మూలంగానే గతంలో కూడా షిరిడి సాయి నగర్ వరద ముంపుకు గురైందని గుర్రపు డెక్కను తొలగించాలనీ ఆయన మున్సిపల్ కమిషనర్ రమాదేవితో చర్వాణిలో సమస్యను వివరించారు. మున్సిపల్ అధికారి రాజయ్య కు గుర్రపు డెక్కను తొలగించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. గుర్రపు డెక్క కారణంగా కాలనీ వాసులకు దుర్వాసనతో అనారోగ్యం కలుగుతుందని వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన సిబ్బందికి ఆదేశించారు. ఎమ్మెల్యే పద్మావతి సహా కారం తో కాలనీవాసులకు ఇబ్బందులు కలక్కుండా చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎర్రవరం పిఎసిఎస్ చైర్మన్ నలజాల శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు రావెళ్ళ కృష్ణా రావు, లైటింగ్ ప్రసాద్, భాస్కర్ ఉన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మానసిక ప్రశాంతతకు యోగా దివ్య ఔషధం

TNR NEWS

బానోత్ బిక్షం నాయక్ మరణం తీరని లోటు

Harish Hs

పూర్వ విద్యార్థులు సేవా గుణం అలవర్చుకోవాలి  – ఘనంగా ఎండ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గురువై విద్యార్థుల సమ్మేళనం   నాటి జ్ఞాపకాలు పంచుకొని ఆడి పాడి పొద్దంతా ఆనందంగా గడిపిన స్నేహితులు

TNR NEWS

కొనసాగుతున్న డేటా ఎంట్రీ నమోదు : ఎంపీడీవో నర్సింహారెడ్డి 

TNR NEWS

ఇక డిగ్రీ రెండున్నరేళ్లే.. వచ్చే ఏడాది నుంచి అమలు: UGC చైర్మన్

TNR NEWS

పీడీఎస్ బియ్యం పట్టివేత…. 8 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు….

TNR NEWS