Tnrnews.in
తెలంగాణ

భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి : రూరల్ ఏసీపీ

యువత గంజాయి, డ్రగ్స్‌ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి వినియోగం వ్యక్తి గత జీవితంతో పాటు కుటుంబం, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి అన్నారు. తిరుమలాయపాలెం పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న రూరల్ ఏసీపీ మాట్లాడుతూ.. విద్యార్థులు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండడంతో పాటు ఇతరులను కూడా అప్ర మత్తం చేయాలని సూచించారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు కట్టుబడి ఉన్నారని, మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై ప్రజలు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పప రిణామాలపై విద్యార్థులు, ప్రజలకు కూడా విస్తృతంగా అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో సిఐ సంజీవ్, ఎస్సై జగదీశ్ పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

బడుగు బలహీన వర్గాల బాగు కోసం కులగణన సర్వే    బొమ్మ కంటి చంద్రమౌళి కాంగ్రెస్ పార్టీ పరకాల ఎస్సీ సెల్ అధ్యక్షులు

TNR NEWS

తాగునీరు అందించేందుకు ప్రణాళికలో చేర్చాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

TNR NEWS

మాలల సింహ గర్జన… చలో హైదరాబాద్ – పిలుపునిచ్చిన ఎస్సి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా నాయకులు గ్యాంగ్ హన్మంతు, యం బి హన్మంతు 

TNR NEWS

విగ్నేశ్వర మహిళా సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు ప్రారంభం

TNR NEWS

సైబర్‌నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

TNR NEWS

ప్రతి ఒకరు సేవాగుణం అలవర్చుకోవాలి

Harish Hs